Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్పీని కలిసిన ఐఎంఏ
నవతెలంగాణ-నల్లగొండ
అనివార్య సమస్యలు వచ్చినప్పుడు డాక్టర్ల, హాస్పిటల్స్ఫై భౌతిక దాడులు జరుగకుండా చర్యలు తీసుకోవాలని డాక్టర్లు జిల్లా ఎస్పీ అపూర్వారావుని కోరారు. నూతనంగా జిల్లా ఎస్పీగా బాధ్యతలు తీసుకున్న అపూర్వరావును బుధవారం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నీలగిరి శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఇదివరకు ఏ విధంగా పోలీస్ వారికి డాక్టర్లు సేవలు అందించారో అదే విధంగా సేవలు అందించాలన్నారు. పోలీస్ శాఖలో ఉన్న స్త్రీలకు వైద్య పరీక్షలు డాక్టర్లకు అనుకూలమైన తేదీలల్లో నిర్వహించాలని కోరారు. ఈ సందర్భంగా సీనియర్ డాక్టర్లు మాట్లాడుతూ తరచుగా కొన్ని అనివార్య సమస్యలు వచ్చినప్పుడు డాక్టర్ల, హాస్పిటల్స్ఫై భౌతిక దాడులు జరుగకుండా చర్యలు తీసుకొని, శవాలను ఎక్కువ సేపు హాస్పిటల్లో ఉంచి గొడవలు పెరుగ కుండా చూడాలని ఎస్పీ కోరారు. నేషనల్ మెడికల్ కమీషన్ అదేశానుసారం అర్హతలేని వారు డాక్టర్లుగా చలామణి అవుతూ ప్రజల ఆరోగ్యం దెబ్బ తీయకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ను ఆదేశించటంతో ఈ సమస్యను ఎదుర్కొనేందుకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖతో పాటు పోలీస్ సహకారం అందించాలని కోరారు. ఎస్పీని కలిసిన వారిలో డాక్టర్లు పుల్లారావు, జయప్రకాశ్ రెడ్డి, అనితా రాణి, గౌరిశ్రీ, రాజేశ్వరి, శోభారాణి పాల్గొన్నారు.