Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అక్కనపల్లి సర్పంచ్ మాదాసు చంద్రశేఖర్
నవతెలంగాణ-నార్కట్పల్లి
మండల పరిధిలోని అక్కెనపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారుల, సిబ్బంది సేవలు అభినందనీయమని ఆ గ్రామ సర్పంచ్ మాదాసు చంద్రశేఖర్ పేర్కొన్నారు. రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమం గ్రామంలో పూర్తయిన సందర్భంగా ఆయన వైద్య సిబ్బందిని శాలువాలతో సన్మానించి, వారు చేసిన సేవలను కొనియాడారు. అక్కనపల్లి గ్రామ పరిధిలో కంటివెలుగు కార్యక్రమంలో మొత్తం 1184 మందికి స్క్రీనింగ్ చేసినట్లు చెప్పారు. వారిలో 188 మందికి రీడింగ్ గ్లాసెస్, 140 మందికి ప్రిస్క్రిప్షన్ గ్లాస్సెస్ అందించారని పేర్కొన్నారు. కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు గ్రామపంచాయతీ సిబ్బంది సహకారం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి శ్రీనివాస్, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.