Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాజీశాసనసభ్యులు జూలకంటి రంగారెడ్డి
నవతెలంగాణ-దామరచర్ల
విద్యార్థుల హక్కుల సాధనలో ఎస్ఎఫ్ఐ కీలక పాత్రను పోషిస్తుందని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి చెప్పారు. దామరచర్లలో జరుగుతున్న ఎస్ఎఫ్ఐ జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక శిక్షణ తరగతులు బుధవారంతో మూడవ రోజుకు చేరుకున్నారు. ఈ కార్యక్రమానికి ఆయన అతిథిగా హజాయి మాట్లాడారు. విద్యారంగంపై మతోన్మాద శక్తుల ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయిందన్నారు. దేశంలో బీజేపీ తీసుకువస్తున్న నూతన జాతీయ విద్యా విధానానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ బలమైన శక్తిగా ఎదగాలని పిలుపునిచ్చారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఈ రోజు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు అన్ని యూనివర్సిటీలో విద్యార్థి ఉద్యమాల వేగుచుక్క ఎస్ఎఫ్ఐ విజయకేతనం ఏగరవేస్తుందంటే కారణం నిత్యం విద్యా రంగ సమస్యలపై సమరశీల పోరాటాలు చేయడం వల్లనే అన్నారు. విద్యార్థులతో పెట్టుకున్న ప్రభుత్వాలు బతికి బట్ట కట్టలేదన్నారు. చరిత్రను పాలకులు మరిచి పోవద్దని చెప్పారు. రాష్ట్రంలో జరుగబోయే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగానికి 30శాతం నిదులు కేటాయించి ప్రభుత్వ పాఠశాలు అన్ని విద్యా సంస్థలను బలోపేతం చేసేందుకు ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులు కృషి చేయాలని కోరారు. బంగారు తెలంగాణలో బంగారు భవిష్యత్ కలిగిన విద్యార్థులు సరైన బాటలో నడావాలంటే ప్రభుత్వ విద్యా సంస్థలలో విద్యార్థులకు సరైన సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. పేద, మధ్యతరగతి విద్యార్థుల ఉన్నత చదువుల కోసం బకాయిలో ఉన్న స్కాలర్ షిప్ ఫీజు, రీయింబర్స్ విడుదల జ్యాపం చేయకుండా తక్షణమే నిధులు విడుదల చేయాలని, పేధ, మధ్యతరగతి విద్యార్థుల న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో డీవైఎఫ్ఐ రాష్ట్రఅధ్యక్షడు కోట రమేష్, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు వీరేపల్లి వేంకటేశ్వర్లు, డీవైఎఫ్ఐ దామరచర్ల మండల కార్యదర్శి వినోద్నాయక్, గిరిజన సంఘం మాజీ జిల్లా అధ్యక్షుడు పాపనాయక్, సీఐటీయూ మండల కార్యదర్శి దయానంద్ కోటి రెడ్డి, ఎస్ఎఫ్ఐ మాజి రాష్ట్ర కమిటీ సభ్యులు శ్రీను నాయక్, నల్లగోండ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఆకారపు నరేష్ ఖమ్మంపాటి శంకర్, మిర్యాలగూడ డివిజన్ కార్యదర్శి కోర్ర సైదానాయక్, పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు వదుద్, జగన్ నాయక్, వీరన్న, సూర్య, రమేష్, తదితరులు పాల్గొన్నారు.