Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యేకు సీపీఐ(ఎం) వినతి
నవతెలంగాణ-నల్లగొండ
పట్టణంలోని 11వ వార్డులో డ్రయినేజీ, సీసీ రోడ్ల నిర్మాణం, మౌలిక సదుపాయాలు కల్పించాలని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు దండంపల్లి సత్తయ్య కోరారు. బుధవారం కతాలగూడెం ప్రాథమిక పాఠశాల ప్రారంభోత్సవానికి హాజరైన స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డికి సీపీఐ(ఎం) 11వ వార్డు శాఖ ఆధ్వర్యంలో స్థానిక సమస్యలపై వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సత్తయ్య మాట్లాడుతూ సీసీ రోడ్లు వేసి డ్రయినేజీ నిర్మాణం చేయకపోవడంతో మురికి నీరు రోడ్లపై ప్రవహించి తీవ్ర అసౌకర్యం జరుగుతుందన్నారు. కతాలగూడెం నుండి వయా మామిళ్లగూడెం రాజీవ్ గృహకల్ప వరకు ఉన్న రోడ్డు పూర్తిగా గుంతల మయం అయిందని దానిపై డాంబర్ రోడ్డు వేయాలని కోరారు. సాగర్ ఎక్స్ రోడ్ నుండి కతాల గూడెం వరకు నాలుగు వరుసల రహదారి, సెంటర్ లైటింగ్ నిర్మాణం చేయాలని, అర్బన్ కాలనీ గ్రౌండ్లో ఉన్న అర్బన్ క్రీడా ప్రాంగణంలో పెద్ద బండరాయి ఉన్నదని దానిని తొలగించి పూర్తిస్థాయి క్రీడా సామాగ్రి ఏర్పాటు చేయాలని కోరారు. కతాల గూడెం లో ఉన్న స్మశాన వాటికకు ప్రహరీ గోడ నిర్మాణం చేసి మౌలిక వసతులు కల్పించాలని అన్నారు. సమ భావన మహిళా సంఘాలకు భవనం నిర్మించాలని కోరారు. వార్డు విస్తీర్ణం ఎక్కువగా ఉన్నందున మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులను విస్తీర్ణానికి అనుగుణంగా 20 మందిని తగ్గకుండా ఇవ్వాలని, నిరంతరాయంగా మంచినీరు సరఫరా అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని, అర్బన్ కాలనీలో నిరుపేదలు ఉన్నందున ఇంటి పన్నులు తగ్గించాలని కోరారు. ఇంటి పన్ను కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఇంటి యజమాని పేరు లేకుండా ఇంటి పన్ను ఇవ్వడం సరికాదని, ఇంటి యజమాని పేరుతో ఇంటి పన్నుల నోటీసు పంపిణీ చేయాలని కోరారు. ఈ సమస్యల పరిష్కారం కోసం చర్యలు తీసుకొని పక్షంలో ప్రజలను సమీకరించి పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ పట్టణ కమిటీ సభ్యులు దండెంపల్లి సరోజ, బూతం అరుణ, పనస చంద్రయ్య, దండంపల్లి యాదయ్య, మారయ్య, పామనగుండ్ల కళమ్మ, పజ్జురి నరసింహ తదితరులు పాల్గొన్నారు.