Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్‌రెడ్డి
నవతెలంగాణ-నల్లగొండ
ప్రభుత్వ పాఠశాలలకు పూర్తిస్థాయిలో మౌలిక వసతుల కల్పన చేసి పాఠశాలలను బలోపేతం చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన ఊరు- మనబడి, మనబస్తీ - మనబడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని, ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ వచ్చిందని నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి అన్నారు. అందులో భాగంగా పూర్తిస్థాయిలో మౌలిక వసతుల కల్పన చేసి సకలవసతులు కల్పించిన నల్లగొండ పట్టణంలోని కతాల్ గూడ,, ఎంకేవీ పద్మనగర్ ప్రాథమిక పాఠశాలలను బుధవారం జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖుష్భు గుప్తలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన ఊరు మన బడి,మన బస్తీ మన బడి కార్యక్రమం ద్వారా తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలను బాగు చేయడానికి సుమారు 7289 కోట్ల రూపాయల నిధులు కేటాయించిందని, అన్ని పాఠశాలలో మౌలిక వసతులను కల్పించి కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా తయారు చేస్తున్నదని తెలిపారు. జిల్లా కలెక్టర్ వినరు క్రిష్ణా రెడ్డి మాట్లాడుతూ మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా నల్లగొండ జిల్లాలోని 517 ప్రభుత్వ పాఠశాలలను గుర్తించి మొదటి విడతలో పూర్తిస్థాయిలో మరమ్మతులు చేయడం జరుగుతోందని, అందులో రాష్ట్రంలోనే అత్యధికంగా నేడు 13 పాఠశాలలను ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. జిల్లా విద్యా శాఖ అధికారి బిక్షపతి మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖుష్భు గుప్తాల పర్యవేక్షణలో రాష్ట్రంలోనే అత్యధికంగా నల్లగొండ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలను ఒకే రోజు ప్రారంభించే అవకాశం కలిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మెన్ మందడి సైదిరెడ్డి, మున్సిపల్ కమీషనర్ రమణాచారి, ఎంపీపీలు కరీం పాషా, విజయలక్ష్మి, జెడ్పీటీసీ పాశం రాంరెడ్డి, చిట్ల వెంకటేశం మండల విద్యాధికారులు నరసింహ, అరుంధతి, రాము, ప్రధానోపాధ్యాయులు తరాల పరమేశ్ యాదవ్, దమనేశ్వర రావు, మున్సిపల్ కౌన్సిలర్లు, సర్పంచులు ఎంపీటీసీలు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
మిర్యాలగూడ : నిరుపేద వర్గాల విద్యార్థుల జీవితాలలో వెలుగులు నింపే కార్యక్రమమే మన ఊరు మనబడి పథకమని మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కరరావు పేర్కొన్నారు. మన ఊరు మనబడిలో భాగంగా పట్టణంలోని ప్రాథమిక పాఠశాల షాబునగర్, మాడుగులపల్లి మండలంలోని తోపుచర్ల ప్రాథమిక పాఠశాల పూర్తిస్థాయిలో ఆధునికరించబడిన పాఠశాలలను బుధవారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ భాస్కరరావు, ఆర్డీఓ చెన్నయ్య, ఎంపీపీలు నూకల సరళ హనుమంత్ రెడ్డి, పోకల శ్రీవిద్య రాజు, మున్సిపల్ వైస్ చైర్మెన్ కుర్ర విష్ణు, కౌన్సిలర్ బంటు రమేష్, బీఆర్ఎస్ పార్టీ పట్టణ ఉపాద్యక్షులు బాసాని గిరి, జిల్లా పరిషత్ కోఆప్షన్ సభ్యులు మోసిన్ అలీ, బీఆర్ఎస్ పార్టీ మాడ్గులపల్లీ మండల అద్యక్షులు పాలుట్ల బాబయ్య, నాయకులు నిమ్మల నవీన్‌రెడ్డి, పునాటి లక్ష్మీనారాయణ, పాక్స్ చైర్మెన్ జేర్రిపోతల రాములు గౌడ్, మండల కో ఆప్షన్ సభ్యులు మౌలాలి, సర్పంచ్‌లు మంగా యాదయ్య, మారుతీ వెంకట్ రెడ్డి, గోవింద్‌రెడ్డి, యాతం లక్ష్మి నరేందర్ రెడ్డి, ఎంపీటీసీ కనకారెడ్డి, గోపాల్ రెడ్డి, అంజిరెడ్డి, చింతకాయల సైదులు, వార్డ్ మెంబర్లు ఖాసిం, దనయ్య, వీరన్న, మున్సిపల్ కమిషనర్ రవీంద్రసాగర్, మండల అభివృద్ధి అధికారులు జ్యోతిలక్ష్మి, జితేందర్‌రెడ్డి, మండల విద్యాధికారి ఎం. బాలాజీ నాయక్, పంచాయతీరాజ్ డీఈ ఈ. వెంకటేశ్వరరావు తదితరులున్నారు.
నార్కట్‌పల్లి : బడుగు బలహీన వర్గాలకు విద్యను అందుబాటులోకి తేవాలనే లక్ష్యంతో ప్రభుత్వ పాఠశాలను మన ఊరు మనబడి పథకం కింద ప్రయివేటుకు దీటుగా ప్రభుత్వ బడులు అన్ని హంగులతో రూపొందిస్తున్నారని జిల్లా పరిషత్ చైర్మెన్ బండా నరేందర్ రెడ్డి, నకరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పేర్కొన్నారు. మండల పరిధిలోని ఎల్లారెడ్డిగూడెం గ్రామంలో మన ఊరు మన బడిలో భాగంగా రూ. 28 లక్షల వ్యయంతో నిర్మించిన ప్రాధమిక పాఠశాలను, 36 లక్షల వ్యయంతో మౌలిక వసతులను కల్పించిన నార్కట్‌పల్లి ప్రాథమిక పాఠశాలను బుధవారం వారు ప్రారంభించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ఖుష్భు గుప్తా, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మెన్ రేగట్టే మల్లికార్జున్ రెడ్డి, ఎంపీపీ సూదిరెడ్డి నరెందర్ రెడ్డి, పంచాయతీరాజ్ డీఈ విష్ణు వర్ధన్‌రావు, వైస్ ఎంపీపీ కల్లూరి యాదగిరిగౌడ్, ఆయా గ్రామాల సర్పంచులు మేడి పుష్పలత శంకర్, దూదిమెట్ల స్రవంతి, ఎంపీటీసీ దుబ్బాక పావని శ్రీధర్, పంచాయతీ రాజ్ అసిస్టెంట్ ఇంజనీర్ పాలమోహన్, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఏ.వెంకట్ రెడ్డి, జీ.వెంకట్‌రెడ్డి, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.