Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -రామన్నపేట
మండలంలోని సిరిపురం గ్రామంలో ఈనెల 3న శ్రీ విశాఖ శారధా పీఠాధిపతులు శ్రీ స్వరుపనందేంద్ర సరస్వతీ స్వామి చేతుల మీదుగా నూతనంగా నిర్మించిన దేవాలయంలో శ్రీ భ్రమరాంబికా సమేత మల్లికార్జున స్వామి, శ్రీ గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, ఆంజనేయ, ధ్వజస్తంభం, నవగ్రహ, కాలభైరవ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ చైర్మెన్ ఏళ్ల నాగమణి బుచ్చిరెడ్డి తెలిపారు. బుధవారం గ్రామంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఈనెల 1 నుండి 3 వరకు ప్రతిష్టాపన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. బుధవారం విఘ్నేశ్వర పూజ, పుణ్యా వచనం, పంచకావ్య ప్రాసన రిత్విక్ భిక్షాధారణ, అంకురార్పణ యాగశాల ప్రవేశన, అగ్నిప్రతిష్టాపన, యాగశాల జలాదివాసము కార్యక్రమాలు జరిగాయన్నారు. 2న చతురాస్తాన అర్చనలు, బలిహరణ, సంస్కృతిక కార్యక్రమాలు 3న దేవతామూర్తుల విగ్ర ప్రతిష్టాపన శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి కల్యాణం ఊరేగింపు భజన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి పూజా కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు.