Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
నవతెలంగాణ -సంస్థాన్ నారాయణపురం
మునుగోడు అభివృద్దే తన లక్ష్యమని ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలో ఉపాధి హామీ, రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి నిధులు రూ.కోటీ 25 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం పీఏసీఎస్ నిధులతో నిర్మించిన 500 మీటర్ల పొడవైన గోదాం, ఐకెపి ద్వారా మహిళా సంఘాలకు మంజూరైన వడ్లు పట్టే యంత్రం, హలో వ్యవసాయ పరికరాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తానన్నారు. గ్రామ అభివృద్ధికి రోడ్లే ప్రధానమన్నారు. రోడ్లతోపాటు మురికి కాల్వల నిర్మాణం అవసరమేనన్నారు. త్వరితగతిన రోడ్ల నిర్మాణం పనులు చేపట్టాలన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ గుత్తా ఉమాదేవీ, జడ్పిటిసి వీరమళ్ల భానుమతి, డీఈ బాలచందర్,పీఏసీఎస్ చైర్మన్ జక్కిడి జంగారెడ్డి, దోడ యాదిరెడ్డి, సర్పంచ్ సికిలమెట్ల శ్రీహరి,ఎంపీటీసీ బచగొని గాలయ్య, వివిధ గ్రామాల సర్పంచులు,ఎంపీటీసీలు, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కత్తుల లక్ష్మయ్యా, ఘోవర్ధన్ రెడ్డి అధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు.