Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఆలేరుటౌన్
పురపాలక సంఘంలో అర్హులైన పేదలకు డబుల్బెడ్రూం ఇండ్లు పంపిణీచేయాలని కోరుతూ బుధవారం సీపీఐ పట్టణకమిటీ ఆధ్వర్యంలో శ్రీ కనకదుర్గ ఆలయం నుండి రైల్వే గేట్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు చెక్క వెంకటేష్ ,మహిళా సమైక్య మండల అధ్యక్షురాలు మాటూరి జానమ్మ, జంగా సరళ, జాంగిరిబి,నీలమ్మ ,కళ్యాణి , సంధ్య , విజయ, పూలమ్మ, కనకమ్మ ,అండాలు, బొడ్డు ఆంజనేయులు, మొగులయ్య, తదితరులు పాల్గొన్నారు.