Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చలమల్ల కృష్ణారెడ్డి
నవతెలంగాణ - చౌటుప్పల్ రూరల్
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను మోసం చేస్తున్నాయని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చలమల్ల కృష్ణారెడ్డి ఆరోపించారు. హాథ్ సే హాత్ జోడో అభియాన్ యాత్ర మండలంలో బుధవారం ప్రారంభించారు. ఆందోల్ మైసమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి బైక్ ర్యాలీ చేపట్టారు. మండలంలోని జై కేసారం గ్రామంలో అభియాన్ యాత్ర నిర్వహించారు. గ్రామంలోని ప్రతి గడపకు వెళ్లి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలను ప్రజలకు తెలియజేశారు. రాహుల్ గాంధీ చేపట్టిన జూడో యాత్ర ఉద్దేశాన్ని ప్రజలకు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎనిమిదేళ్ల పాలనలో అపఖ్యాతిని మూటగట్టుకుందని విమర్శించారు. దేశాన్ని బడా పారిశ్రామికవేత్తలకు దోచిపెడుతుందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి ఆకుల ఇంద్రసేనారెడ్డి, సుర్వి నరసింహ, నాయకులు బోయ దేవేందర్, జీన్రు అంజిరెడ్డి, మునుకుంట్ల రాజు, పన్నాల రాజిరెడ్డి, చంద్రయ్య, శ్రీనివాస్, నారాయణ, నరసింహ, బండమీది వెంకటేష్, శేఖర్, మేకల దేవేందర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, కేతురాజు తదితరులు పాల్గొన్నారు.