Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వనం రాజు
నవతెలంగాణ - భువనగిరి
ఇంటర్ వ్యాల్యుయేషన్ లో ఓకే సారి ఆన్ లైన్ విధానం వద్దు, విద్యార్ధులు నష్టపోకుండా చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వనం రాజు అన్నారు.బుధవారం ఇంటర్ పరీక్ష ల మూల్యకంనం ఆన్లైన్ వద్దని భువనగిరి జిల్లా కేంద్రంలో ఇంటర్మీడియట్ నోడల్ అధికారిణి రమణికి వినతిపత్రం అందజేశారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పేపర్లను ఒకేసారి అన్ని పేపర్లును ఆన్ లైన్ ద్వారా వాల్యుయేషన్ చేయాలని బోర్డు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు.ఈ కార్యక్రమంలో ఆ పార్టీ పట్టణ నాయకులు జ్వాల యువరాజు,గోడుసుల అజరు, చింతల చింటూ,ఎండి.నేహల్ పాల్గొన్నారు.