Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చౌటుప్పల్
సీపీఐ నల్లగొండ జిల్లా కార్యవర్గ సభ్యులు, చండూరు వైస్ ఎంపీపీ మందడి నర్సింహారెడ్డి బుధవారం గుండెపోటుతో మరణించాడు. చౌటుప్పల్ పట్టణకేంద్రంలో నర్సింహారెడ్డి మృతదేహంపై సీపీఐ, సీపీఐ(ఎం) నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన మృతి సీపీఐకి తీరని లోటు అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నర్సింహారెడ్డి అనేక పోరాటాలు నిర్వహించారన్నారు. నర్సింహారెడ్డి పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండలకార్యదర్శి గంగదేవి సైదులు, మున్సిపల్ కార్యదర్శి బండారు నర్సింహా, సీపీఐ మున్సిపల్ కార్యదర్శి పగిళ్ల మోహన్‌రెడ్డి, నాయకులు ఆకుల ధర్మయ్య, గోశిక కరుణాకర్, దేప రాజు, కొండూరు వెంకటేశ్, బద్దుల సుధాకర్, కుండె శ్రీశైలం, టంగుటూరి రాములు, ఎస్ఎ.రహమాన్, గుణమోని అయిలయ్య, నర్సింహా, బిక్షపతి, కట్టెల లింగస్వామి, దాసరి యాదయ్య పాల్గొన్నారు.