Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) మండల కార్యాలయ శంకుస్థాపనలో కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు
నవతెలంగాణ -తుర్కపల్లి
కేంద్రం ప్రజాకంఠక మతోన్మాద పాలనపై ప్రజలు ఓటు ద్వారా గుణపం దింపాలని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు ప్రజలకు పిలుపునిచ్చారు. బుధవారం మండలకేంద్రంలో సీపీఐ(ఎం) కార్యాలయ శంకుస్థాపనకు ముఖ్య అతిథిగా హాజరైన చెరుపల్లి సీతారాములు, పార్టీ జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కల్లూరి మల్లేశంలతో కలిసి శంకుస్థాపన చేశారు.. ఈ సందర్భంగా చెరుపల్లి మాట్లాడుతూ...కమ్యూనిస్టు పార్టీ కార్యాలయాలు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కార కేంద్రంగా పని చేయాలని సూచించారు. ప్రజలను మతం పేరుతో చీల్చుతూ దేశ సంపదను మొత్తం కార్పొరేట్లకు కట్టబెడుతూ అదానీని ప్రపంచ ధనికులులలో మూడో స్థానంలో నిలబెట్టిన ఘనత బీజేపీ నరేంద్ర మోడీదని విమర్శించారు.నరేంద్రమోదీ నిజస్వరూపం గుజరాత్ మరణకాండకు కారణమని తెలియజేస్తూ బీబీసీ డాక్యుమెంటరీ విడుదల చేసిందని దాన్ని బీజేపీి రాద్దాంతం చేస్తుందని తెలిపారు.మోడీ ప్రధానమంత్రి కాక ముందు మాములు వ్యాపార వేత్తగా ఉన్న గౌతమ్ అధానీ నేడు 12లక్షల కోట్లకు చేరుకున్నాడని ఇలా ఒకశాతం మంది వద్దనే దేశంలో 70 కోట్ల మంది ప్రజలకు సమానమైన ఆస్తులు ఉన్నాయన్నారు. బీజేపీ ఆధికారంలోకి వచ్చిన తర్వాత పేదలు మరింత పేదలుగా మారారని ధనికులు మాత్రం మరింత ధనవంతులుగా అవతరించారని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రజలను నిత్యం చైతన్య వంతం చేసే పనిలో కమ్యూనిస్టు కార్యకర్తలు ఉండాలని పిలుపునిచ్చారు.
సీపీఐ(ఎం)లో చేరికలు
ముల్కలపల్లి నుండి గతంలో ఎంపీటీసీగా పోటిచేసిన భూక్య లక్ష్మీ, భూక్య శ్రీను నాయక్‌లో సీపీఐ(ఎం)లో చేరారు. వారికి చెరుపల్లి, జహంగీర్ పార్టీ కండువాలకు కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కల్లూరి మల్లేశం, మండల కార్యదర్శి పోతరాజు జహంగీర్, సినీయర్ నాయకులు కొక్కొండ లింగయ్య, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాద్యక్షులు లావుడ్య రాజు,నాయకులు తలారి మాతయ్య,దార్ల దుర్గయ్య,ఆవుల కళమ్మ,వెంకటేశం,నాగరాజు, మంత్రి నర్సింహ,కర్ణాకర్,పెంటయ్య,కాశయ్య సిఐటియు నాయకులు గుండెబోయిన బలరాం ప్రజా సంఘాల నాయకులు గజం ఉప్పలయ్య తోటి సంజీవ గుండెబోయిన కృష్ణమూర్తి పల్లెపాటి చంద్రాసు మోత్కుపల్లి రఘు ముట్రాజ్ పల్లి చంద్రం తదితరులు పాల్గొన్నారు.