Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంగ్రెస్ ఆలేరు నియోజకవర్గ ఇన్చార్జి బీర్ల ఐలయ్య
నవతెలంగాణ -బొమ్మలరామరం
ప్రజాసేవ లక్ష్యంగా ముందుకు వెళుతున్న తనకు అధిష్టానం నియోజకవర్గంలో టికెట్ ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని కాంగ్రెస్ ఆలేరు నియోజకవర్గ ఇన్చార్జి బీర్ల ఐలయ్య అన్నారు. అధికారం ముఖ్యం కాదని ప్రజాసేవే ముఖ్యమని అధిష్టాన నియోజకవర్గంలో టికెట్ ఇస్తే సంతోషిస్తానని, ఒకవేళ ఇవ్వకపోయినా నేను ప్రజలతోనే ఉంటానని ప్రజలకు సేవ చేస్తూ ఉంటానని తెలిపారు. గురువారం మండలంలోని ఫకీర్ గూడం, మేడిపల్లి, మైలారం, కిందితండా, తిరుమలగిరి, మైసిరెడ్డిపల్లి, పెద్దపర్వతపురం, రంగపూర్,రామలింగపల్లి, తూముకుంట, మునిరాబాద్, మచాన్ పల్లి, మర్యాల గ్రామల్లో గడప గడపకు బీర్ల ఫౌండేషన్ సహకారంతో వాటర్ క్యాన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన బీర్ల ఫౌండేషన్ సౌజన్యంతో ఉచితంగా వాటర్ క్యాన్లు మొదటిసారిగా బొమ్మలరామారం మండలంలో పంపిణీ చేయడం ఎంతో సంతోషకరమైనదన్నారు. ఆలేరు నియోజకవర్గం మొత్తం వాటర్ ఫిల్టర్ లను ఏర్పాటు చేయడంతో పాటు వాటర్ క్యాన్లను పంపిణీ చేయడానికి ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. మండలం ఎలాంటి అభివద్ధికి నోచుకోలేదని ఆరోపించారు. గ్రామంలో ఎక్కడ ఉన్నా సమస్యలు అక్కడే ఉన్నాయని, అవి పరిష్కారం కావాలంటే మళ్లీ కాంగ్రెస్ పార్టీ రావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
సర్పంచిని పరామర్శించిన బీర్ల
మండలంలోని ఫకీర్ గూడెం సర్పంచ్, మండల సర్పంచులు ఫారం అధ్యక్షుడు మెడబోయిన గణేష్ ముదిరాజ్ ఇటీవల అనారోగ్యానికి గురికావడంతో గురువారం కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి బీర్ల ఐలయ్య పరామర్శించాడు. అనంతరం ఆ గ్రామంలో వాటర్ క్యాన్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆపార్టీ నాయకులు గ్రామస్తులు ,తదితరులు పాల్గొన్నారు.