Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలి
- సీఐటీయూ జిల్లా కార్యదర్శి కోమటిరెడ్డి చంద్రారెడ్డి
నవతెలంగాణ -భువనగిరిరూరల్
మిషన్ భగీరథ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈనెల 6 న చలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు సీఐటీయూ జిల్లా కార్యదర్శి, మిషన్ భగీరథ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోమటిరెడ్డి చంద్రారెడ్డి తెలిపారు. ఈ మేరకు మిషన్ భగీరథ ఎస్ఇ కృష్ణయ్య, ఇఇ డి. లక్ష్మన్, మెగా కంపని మేనేజర్ సత్యనారాయణలకు గురువారం వినతిపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, కనీస వేతనం 26 వేలు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 20 శాతం బోనస్, రక్షణ పరికరాలు, గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలన్నారు. కార్మికులకు 8 గంటల పని అమలు చేయాలన్నారు. లైన్మెన్స్కు ట్రావెలింగ్ అలవెన్స్ ఇవ్వాలని, లేదంటే 15 కి.మీటర్లకు ఒక్కరిని లైన్మెన్ నియమించాలన్నారు. జిఓ నెం 60 లేదా 11ను అమలు చేయాలన్నారు. ప్రావిడెంట్ ఫండ్, ఇఎస్ఐ లను డిపార్ట్మెంట్ నేరుగా కార్మికుల ఖాతాలో జమ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షులు సిహెచ్ శ్రీను, వర్కింగ్ ప్రసిడెంట్ సిహెచ్ మల్లేశం, నాయకులు యు బాలరాజు, కుమారస్వామి, చంద్రమౌళి, మత్స్యగిరి, సంపత్ కుమార్, నాగరాజు, నవీన్, శ్రీకాంత్, ప్రసాద్, జంగయ్య, ఉపేందర్, శ్రీను, ప్రశాంత్, రమేశ్, అశోక్, కరుణాకర్, మహేశ్, సురేశ్, వి జంగయ్య, చంద్రయ్య, మైసయ్య, రాములు, రవి, సంతోష్, రాజు, సత్యానారాయణ, యాదగిరి, వెంకటేశ్ పాల్గొన్నారు.