Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - భువనగిరి
కేంద్ర ప్రభుత్వం పెట్టిన బడ్జెట్ను సవరించి వికలాంగులకు ఐదు శాతం నిధులు కేటాయించాలని, బడ్జెట్లో వికలాంగులకు నిధుల కేటాయింపులో నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఎన్పీఆర్డీ ఆధ్వర్యంలో బడ్జెట్ ప్రతులను దహనం చేశారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్ మాట్లాడుతూ బడ్జెట్ కేటాయింపులో వికలాంగుల సంక్షేమాన్ని ప్రభుత్వం విస్మరించిందని అన్నారు. వికలాంగుల (హక్కుల) చట్టం అమలు పథకానికి గతేడాది బడ్జెట్ కంటే ఈ ఏడాది రూ.90 కోట్లు తగ్గించడం ద్వారా వికలాంగుల చట్టం అమలును నిర్వీర్యం చేయడానికి కుట్రలు చేస్తుందని తెలిపారు. పార్లమెంట్ ఆమోదించిన నేషనల్ ట్రస్ట్ , రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వంటి చట్టాల అమలుకు నిధులు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వ రంగంలో ఉద్యోగావకాశాలు తగ్గిపోతున్న కారణంగా ఉపాధి సంక్షోభాన్ని అధిగమించేందుకు ప్రయివేటు రంగంలో వికలాంగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రోత్సాహకాలు ప్రవేశపెట్టలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి బొల్లేపల్లి. స్వామి, జిల్లా మహిళా విభాగం కన్వీనర్ కొత్త.లలిత, జిల్లా నాయకులు జోకు స్వామి, కటకమోజు అంజన్శ్రీ, కొండాపురం మనోహార ,లింగం నాయక్,అనసూయ, భూక్యా వెంకటేష్ పాల్గొన్నారు.