Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోటగోపి
నవతెలంగాణ-సూర్యాపేట
సంక్షేమ పథకాలు ఎత్తివేయడం, ఉపాధి నిధుల భారీగా తగ్గిస్తూ జనాభా దామాషా ప్రకారం నిధులు కేటాయించడంలో దళితులకు బీజేపీ ప్రభుత్వం కేంద్ర బడ్జెట్లో ద్రోహం చేసిందని కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోట గోపి విమర్శించారు.దళితులకు కేంద్రం బడ్జెట్లో చేసిన ద్రోహనికి నిరసనగా గురువారం స్థానిక నల్లాలబావి సెంటర్లో బడ్జెట్ ప్రతులను దహనం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో దళితులు 20శాతం ఉండగా కేంద్ర బీజేపీ సర్కార్ దళితులకు 16శాతం నిధులు మాత్రమే కేటాయించిందన్నారు.ఆ నిధులు కూడా సక్రమంగా ఖర్చు చేయడం లేదన్నారు. బడ్జెట్ పత్రాలలో దళితులకోసం అంకెలు పెంచుతున్నారని, అంకెల పెరుగుదలే కానీ ఆచరణలో నిధులు ఖర్చు చేయడం లేదన్నారు.గత బడ్జెట్లో ఉపాధి హామీచట్టానికి రూ.89400 కోట్లు కేటాయించగా ఈ బడ్జెట్లో రూ.60000కోట్ల కు తగ్గించి దళితులకు అన్యాయం చేసిందన్నారు.మొత్తం సంక్షేమ పథకాలను ఎత్తివేస్తున్న ప్రభుత్వం దళితుల ఆర్థిక అభివృద్ధికి ఏ విధంగా దోహదపడుతుందో చెప్పాలన్నారు.దళితుల విద్యాభివృద్ధికి ఒక రూపాయి కూడా పెంచలేదన్నారు.విద్య,వైద్యం, ఉపాధి, ఇండ్ల స్థలాలు, ఇండ్లు ,తాగునీరు వంటి సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం బడ్జెట్లో కేటాయింపులు చేయలేదన్నారు.2014 నుండి ఎనిమిదేండ్ల కాలంలో దళితులపై సామాజికంగా దాడులు, దౌర్జన్యాలు పెరుగుతుంటే ఈ 2023 బడ్జెట్లో ఆర్థిక అణిచివేతకు, వివక్షకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. దళితుల అక్షరాస్యత కేవలం 58 శాతం మాత్రమే ఉందన్నారు.వారి విద్యపట్ల ప్రభుత్వానికి శ్రద్ధ లేదన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మర్రి నాగేశ్వరరావు, జిల్లా సహాయ కార్యదర్శి పిండికి నాగమణి, టేకుల సుధాకర్, జిల్లా నాయకులు ఏసు,రవి తదితరులు పాల్గొన్నారు.
ప్రజా వ్యతిరేక బడ్జెట్
నూతనకల్ :కేంద్ర ఆర్థిక మంత్రి పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజా వ్యతిరేకమని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి కందాల శంకర్‌రెడ్డి అన్నారు.గురువారం మండలపరిధిలోని చిల్పకుంటలో కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ ప్రతులను దహనం చేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ బడ్జెట్ సంపన్నవర్గాలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారని విమర్శించారు. వ్యవసాయరంగానికి కోతలు విధించి ఉపాధిహామీ చట్టాన్ని తూట్లు పొడిచే విధంగా ఉందన్నారు.విద్య, వైద్య రంగాలకు తగినంత కేటాయించలేదని విమర్శి ంచారు.రాష్ట్రానికి మంజూరు చేసిన రైల్వేలైన్‌కు నిధుల కేటాయింపు తగ్గిందన్నారు.కేంద్రం రాష్ట్రంపై కక్షపూరిత వైఖరితో వ్యవహరిస్తున్నట్టు బడ్జెట్లో స్పష్టమైనదని విమర్శించారు.ఈ కార్యక్రమంలో బొజ్జ శ్రీను, కూసుసైదులు,సామవెంకట్‌రెడ్డి, సామసురేందర్రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి,పోలేపాకనగేష్, కట్ట సత్యనారాయణరెడ్డి, బాలగాని సోమయ్య ,సింగిరెడ్డి జనార్దన్‌రెడ్డి, జటంగి లింగయ్య, రేసు జనార్దన్, కూసుగోపాల్, భువనగిరి శ్రీకాంత్,జటంగి లింగయ్య, ఉప్పుల పరమేశ్ పాల్గొన్నారు.