Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సూర్యాపేట
రాష్ట్రంలోని సబ్బండవర్ణాల అభ్యున్నతే సీఎం కేసీఆర్ లక్ష్యం అని,తెలంగాణలో ప్రతివర్గం, కులం బాగుపడాలన్నదే ఆయన సంకల్పమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు.పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర సందర్భంగా గురువారం స్థానిక క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన యాదవసోదరులకు సంప్రదాయ దుస్తులు, 150 భేరీలను మంత్రి పంపిణీ చేసి మాట్లాడారు.అన్ని సంస్కృతులు, సంప్రదాయాలకు గౌరవం లభించేది దేశంలో ఒక్కతెలంగాణ రాష్ట్రంలోనేనన్నారు.2014కు ముందు పెద్దగట్టును ఏ పాలకు లు పట్టించుకోలేదన్నారు.కేసీఆర్ సీఎం అయ్యాకే ఇప్పటివరకు రూ.15 కోట్లతో గట్టుపై శాశ్వత నిర్మాణాలు చేపట్టామన్నారు.సూర్యాపేటకు తలమానికంగా ఉన్న పెద్దగట్టుకు జాతర సందర్భంలోనే కాకుండా నిత్యంభక్తులు తాకిడి ఎక్కువైందన్నారు.వారి కోసమే శాశ్వత మంచి నీటి ట్యాంక్,గెస్ట్‌హౌజ్, పూజారి నివాసం, కోనేరునిర్మాణం, మహిళ కోసం గదుల వంటి నిర్మాణాలను చేపట్టామన్నారు.గత పాలకుల మాదిరిగానో, ఇతర రాజకీయ పార్టీల మాదిరిగానో మావి ఓట్ల రాజకీయాలు కాదన్నారు.ప్రజాసంక్షేమమే తమ ధ్యేయం అన్నారు.తెలంగాణలో సబ్బండ వర్ణాలకు జరుగుతున్న అభివృద్ధిని చూసే కేసీఆర్ పాలన కోసం దేశవ్యాప్తంగా ప్రజలుఎదురు చూస్తున్నారన్నారు.ఈకార్యక్రమంలో పెద్దగట్టుచైర్మెన్ కోడి సైదులుయాదవ్, డీసీఎంఎస్ చైర్మెన్ వట్టెజానయ్యయాదవ్, జిల్లా పరిషత్ వైస్‌చైర్మెన్ గోపగాని వెంకట్‌నారాయణగౌడ్, జిల్లా గ్రంథాలయ చైర్మెన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, మున్సిపల్ వైస్‌చైర్మెన్ పుట్ట కిషోర్, బీఆర్ఎస్ రాష్ట కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు,పెన్‌పహాడ్ ఎంపీపీ నెమ్మాది భిక్షం, సూర్యాపేట ఎంపీపీ రవీందర్‌రెడ్డి, జెడ్పీటీసీలు జీడి భిక్షం, సంజీవనాయక్, అనిత అంజయ్య, సింగిల్ విండో చైర్మెన్లు, మండల అధ్యక్షులు పాల్గొన్నారు.