Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఆత్మకూరుఎస్
మండలపరిధిలోని బొప్పారం గ్రామ పంచాయితీ పారిశుధ్య కార్మికుడు ఇందూరి లచ్చయ్య (60) అనారోగ్యంతో బుధవారం రాత్రి మృతి చెందాడు.గురువారం లచ్చయ్య కుటుంబసభ్యులను ఎంపీడీఓ మల్సూర్నాయక్, ఎంపీఓ సంజీవ పరామర్శించారు. ఈ సందర్బంగా ఎంపీడీఓ గ్రామపంచాయితీ నుండి రావాల్సిన జీతం ,మరియు దహన సంస్కారాల కోసం రావాల్సిన డబ్బులు వెంటనే ఇప్పిస్తానని హామీ ఇచ్చారు.మృతుని భార్యకు మండల సిబ్బంది యూనియన్ తరపున రూ.5 వేల ఆర్థికసాయం అందజేశారు.పరామర్శించిన వారిలో మండల గ్రామపంచాయితీ సిబ్బంది అధ్యక్షులు బండారు సైదులు, ప్రధానకార్యదర్శి బొడ్డు పీటర్,ఉపాధ్యక్షులు పిడమర్తి ప్రసాద్, జిల్లా గౌరవఅధ్యక్షులు కొచ్చెర్ల అశోక్ ఉన్నారు.