Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రారంభించిన ఎమ్మెల్యే మల్లయ్యయాదవ్
నవతెలంగాణ-కోదాడరూరల్
కోదాడలో మొట్టమొదటిసారిగా లింగమంతుల స్వామి జాతర సందర్భంగా దేవాలయ కమిటీ వారు ఏర్పాటుచేసిన జాతీయస్థాయి ఒంగోలు జాతి ఎడ్లబండ్ల లాగుడు ప్రదర్శన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ గురువారం ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లింగమంతుల జాతర సందర్భంగా పట్టణంలో పండుగ వాతావరణం సంతరించు కుందన్నారు. జాతరలో ఎడ్లపందేలు నిర్వహించడం తెలంగాణ రాష్ట్ర సంస్కృతి సంప్రదాయమన్నారు.రైతుల్లో ఆనందోత్సావాలు,కోడెల పెంపకంలో ఆసక్తి పెంచేందుకు ఈ పోటీలు దోహదపడుతాయన్నారు.5,6వ తేదీల్లో జరిగే జాతరకు తరలి రావాలన్నారు.కాగా ఎడ్లపందేల్లో రైతులు ఉత్సాహంగా పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ చింత కవితరాధారెడ్డి, కౌన్సిలర్లు కోటమధు, పద్మజా, గుండెల సూరి,పట్టణ అధ్యక్షులు చందు నాగేశ్వర్రావు, యాదవ సంఘం నాయకులు ఉపేందర్, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.