Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- త్వరలోనే మెడికల్ కళాశాల భవనం ప్రారంభం
- ఆస్పత్రి నిర్మాణానికి రూ.116 కోట్లు నిధులు మంజూరు
- వైట్ కోట్ ఉత్సవంలో మంత్రి జగదీశ్‌రెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేట
సమాజంలో అనారోగ్యాన్ని నివారించడం ద్వారానే గణనీయమైన పురోభివృద్ధిని సాధించవచ్చని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు.గురువారం స్థానిక మెడికల్ కాలేజీల నిర్వహించిన వైట్‌కోట్ ఉత్సవంలో వైద్య విద్యార్థులకు ఆయన వైట్కోట్స్ అందజేసి మాట్లాడారు.ఇదే సూత్రాన్ని నమ్మిన ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రవ్యాప్తంగా తెచ్చిన మెడికల్ కాలేజీలను తీసుకువచ్చారని తెలిపారు.ప్రభుత్వ వైద్యాన్ని ప్రజలకు చేరువ చేయడానికి ముఖ్యమంత్రి చేస్తున్న యజ్ఞంలో వైద్య విద్యార్థులంతా భాగస్వామ్యమై సీఎం కేసీఆర్ కలలను నిజం చేయాలన్నారు.వైట్ కోటు వైద్య వృత్తికి చిహ్నమన్నారు.విద్యార్థులు అంతా వైద్య రంగంలోకి ప్రవేశించినందుకు గుర్తుగా వైట్ కోటు అందుకున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. వైట్ కోటు వంటి వేడుకలు నిర్వహించడం ద్వారా విద్యార్థుల్లో విధ్య పట్ల గౌరవం, అంకిత భావం ఏర్పడతాయని పేర్కొన్నారు.ఒకప్పుడు వైద్యానికికి ఆమడ దూరంలో ఉన్న సూర్యాపేటను మెడికల్ హబ్‌గా చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనన్నారు.కళాశాల ప్రిన్సిపాల్ శారద విద్యార్థులకు వైట్కోట్స్ ధరింప చేసి అనంతరం ప్రతిజ్ఞ చేయించారు.తెలుపు వర్ణంతో మెరిసిపోయే కోట్స్ ధరించిన విద్యార్థులు కాలేజీలో సందడి చేశారు.నూతనంగా పీజీ విభాగంలో సీట్లు సాధించిన 8మంది విద్యార్థులకు మంత్రి స్వాగతం పలికారు.
త్వరలోనే మెడికల్ కళాశాల ప్రారంభం
ఆస్పత్రి భవనానికి రూ.116 కోట్లు విడుదల
ఇప్పటికే నిర్మాణం పూర్తి చేసుకున్న మెడికల్ కళాశాల భవనాన్ని త్వరలోనే పూర్తి చేస్తామని మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు.అదేవిధంగా ప్రభుత్వాస్పత్రి భవన నిర్మాణానికి రూ.116 కోట్లు విడుదల అయ్యాయని తెలిపారు.నర్సింగ్ కాలేజీని కూడా ప్రస్తుతం ఉన్న మెడికల్ కాలేజ్ ప్రాంగణంలో నిర్మించి మెడికల్‌హబ్‌గా తీర్చిదిద్దుతామని తెలిపారు.ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ శారద, సూపరిడెంట్ మురళీధర్‌రెడ్డి, ఎస్పీ రాజేంద్రప్రసాద్, అడిషనల్ కలెక్టర్ పాటిల్ హేమంత్‌కేశవ్, నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, గ్రంథాలయ చైర్మెన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, నల్లగొండ జిల్లా పరిషత్ చైర్మెన్ బండా నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు.