Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -ఆలేరుటౌన్
ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవన నిర్మాణం నాసిరకంగా నిర్మించడంతో పగుళ్లు వచ్చాయి. నిర్మాణం తగు జాగ్రత్తలు తీసుకోకుండా సిమెంటు ఇసుక సమపాలలో లేకపోవడం కారణంగా నాసిరకంగా పనులు చేపట్టడంతో పై కప్పు పై వర్షాకాలంలో కురిసిన వర్షాలకు అప్పుడే మట్టి ఇసుక తేలిపోతుంది. భవన నిర్మాణం జరిగి కేవలం ఆరు సంవత్సరాలు మాత్రమే అయ్యింది. నియోజకవర్గం కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్మాణం ప్రభుత్వ నిధులతో ఆలేరు మండల, పరిసర మండలాల, ప్రాంత విద్యార్థుల సౌకర్యార్థం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, విద్యా , సంక్షేమ మౌలిక వసతుల అభివద్ధి సంస్థ ఆధ్వర్యంలో 2016 సంవత్సరంలో నిర్మాణం పూర్తి చేసుకుంది. గొంగిడి సునీత మహేందర్ రెడ్డి తేదీ 24 ఒకటవ నెల 2017లో ఈ డిగ్రీ కళాశాలను అట్టహాసంగా ప్రారంభించారు. పైకప్పు పై సిమెంటు మట్టి తేలిన కారణంగా స్లాబ్ పై పెచ్చులు ఊడిపోతున్నాయి. మరమ్మతులు చేపట్టాల్సిన కాంట్రాక్టర్ తన సమయమైపోయిందని చేతులెత్తేస్తున్నాడు. పట్టణంలోని ఇంటర్మీడియట్ కళాశాలలో సైతం గోడలు పగుళ్లు పట్టి పెచ్చులు ఊడిపోవడంతో వర్షానికి కురుస్తుంది, విద్యార్థులకు తగు సౌకర్యాలు లేకపోవడంతో చెట్ల కిందనే వారికి పాఠాలు బోధించే పరిస్థితి అధ్యాపకులకు నెలకొంది. తహసీల్దార్ సైడ్ కార్యాలయం సైతం పెచ్చులు ఊడిపోయి స్లాబ్ గోడలు పగుళ్లు ఏర్పడ్డాయి. ఎప్పుడు పైనుండి పెచ్చులు ఊడి పడతాయేమోనని సిబ్బంది ,అధికార యంత్రాంగం భయాందోళనకు గురవుతున్నారు. ప్రధాన కార్యాలయాల పరిస్థితి, ప్రభుత్వ డిగ్రీ ,ఇంటర్మీడియట్ కళాశాల పూర్తిగా పాడవకముందే మరమ్మతులు చేపట్టాలని పాఠశాల ప్రిన్సిపాల్ అధ్యాపకులు విద్యార్థులు కోరుతున్నారు.