Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్ పమేలా సత్పతి
నవతెలంగాణ -భువనగిరిరూరల్
జినారాయణమ్మ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పుల్లా రెడ్డి గ్రూప్ వారు జిల్లాలో విద్యార్థుల భవిష్యత్తుకు ఉపయోగపడే వర్క్ షాపులు, కౌన్సిలింగ్ కార్యక్రమాల నిర్వాహణకు ముందుకు రావడం అభినందనీయమని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో కలెక్టర్‌ను జిఎన్ఐటి రెడ్డి గ్రూప్ వారు కలిసి జిల్లాలో చైల్డ్ డెవలప్మెంట్ యాక్టివిటీస్‌ను పెంపొందించు కోవడానికి, క్యాంపుల ద్వారా అవగాహన కల్పిస్తామని అన్నారు. భవిత సెంటర్ లలో ఐఈఆర్సీలకు వర్క్ షాప్ ఏర్పాటు చేసి పిల్లల బాగోగులు, చదువులో ముందుండేందుకు గాను అవగాహన కల్పిస్తామన్నారు. ఇంటర్మీడియట్ కళాశాలలో ఆడపిల్లలకు కెరీర్ కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుందని, ప్రభుత్వ పాఠశాలలో ఏమైనా అవసరం ఉంటే తగిన సూచనలు, సలహాలు చేసి వారికి అవసరమైన స్కిల్స్ మెరుగుపర్చుతామని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇలాంటి అవగాహన కార్యక్రమాలు, క్యాంపులు ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని, జిల్లాలో 20 భవిత సెంటర్లలో పిల్లలకు క్యాంపులు ఏర్పాటు చేసి అవగాహన కల్పించాలని, పిల్లల యొక్క భవిష్యత్తు బాగుదలకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి వారికి వర్క్ షాప్ ద్వారా తెలియజేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ, జిల్లా విద్యా శాఖ అధికారి నారాయణ రెడ్డి, జిల్లా వైద్య శాఖ అధికారి డాక్టర్ మల్లికార్జున్, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి రమణి, సెక్టోరియల్ అధికారి ఆండాళు, జీఎన్‌ఐటీ పుల్లా రెడ్డి గ్రూప్ చైర్మెన్‌్ , సునంద, ఫ్యాకల్టీ హెడ్ పాల్గొన్నారు.