Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్పొరేట్ కంపెనీలకు ఊడిగం చేస్తున్న మోడీ సర్కార్
- తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి మాటూరి బాలరాజు గౌడ్
నవతెలంగాణ-మోత్కూర్
పార్లమెంట్ లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ లో వ్యవసాయ రంగానికి భారీగా నిధుల కోత విధించండం రైతాంగాన్ని తీవ్ర నిరాశకు గురి చేసిందని, వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ కంపెనీల పరం చేసేలా ఉందని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి మాటూరి బాలరాజుగౌడ్ విమర్శించారు. తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం మోత్కూర్ మండలం ముశిపట్ల గ్రామంలో రైతు సంఘం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్లమెంటు లో ప్రవేశపెట్టిన 2023-24 కేంద్ర బడ్జెట్ లో గత సంవత్సరం బడ్జెట్ కంటే 500000 కోట్ల రూపాయలు కోత విధించిందన్నారు. దేశ రైతాంగం, రైతు సంఘాలు కోరుతున్న విధంగా స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం అన్ని పంటలకు మద్దతు ధరలు ప్రకటించి ఆ ధరలకు చట్టబద్ధత కల్పించడం వంటి చర్యలు ఈ బడ్జెట్ ప్రతిపాదనలలో లేకపోవడం అన్యాయమన్నారు. సేంద్రియ వ్యవసాయం, చిరుధాన్యాల వ్యవసాయం చేసే రైతులకు ప్రోత్సాహకులు అందిస్తామని చెబుతూనే వ్యవసాయం మార్కెట్ కార్పొరేట్ కంపెనీల మార్కెట్ గా మార్చివేసి కార్పొరేట్ వ్యవసాయానికి కేంద్ర ప్రభుత్వం బాటలు వేసిందన్నారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం రైతులకు ఏమాత్రం ఉపయోగకరంగా లేదని సమగ్ర పంటల బీమా పథకం అమలు చేయాలన్నారు. కేంద్ర బడ్జెట్ లో వ్యవసారంగానికి 10 శాతం నిధులు కేటాయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం మోత్కూరు మండల అధ్యక్షులు పాటి శ్రీనివాస్ రెడ్డి, కార్యదర్శి దడిపల్లి ప్రభాకర్, రైతు సంఘం సీనియర్ నాయకులు పైళ్ల రాంరెడ్డి , పైళ్ల పాపిరెడ్డి, పైళ్ల వరమ్మ, రేసు అండాలు, పైళ్ల సరిత, ముప్ప లింగా రెడ్డి, అల్లూరి నర్సిరెడ్డి, ఎలిమినేటి సరిత, ఏపూరి కిష్టయ్య, ఎలిమినేటి ముత్యంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.