Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అ నిర్మాణం పూర్తి అయిన లబ్ధిదారులకు అందని వైనం అ లబ్దిదారుల ఎంపిక పూర్తి .? అ ప్రభుత్వ అధికారుల జాప్యంపై ప్రజల ఆగ్రహం
నవతెలంగాణ - చౌటుప్పల్రూరల్
ప్రభుత్వ పథకాల ఆశయాలకు తూట్లు పడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేదలకు ప్రభుత్వ పథకాలు అందించడంలో అధికారుల నిర్లక్ష్యం వహిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం లబ్ధిదారుల చెంతకు చేరడం లేదు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించిందే చాలా తక్కువ. ఆ నిర్మించిన ఇండ్లు కూడా నేటికీ లబ్ధిదారులకు అందించడం లేదు.
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం 72 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించి సుమారు రెండు సంవత్సరాలు గడుస్తుంది. మండలంలో ఒకే ఒక్కచోట నిర్మించిన ఈ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు,నిర్మాణం పూర్తయినా కూడా లబ్ధిదారులకు అందించడంలో అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు.
గ్రామసభలో లబ్దిదారుల గుర్తింపు..
దండు మల్కాపురం గ్రామంలో నిర్మించిన 72 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు 189మంది పేదలు దరఖాస్తు చేసుకున్నారు.మునుగోడు ఉప ఎన్నికలకు ముందే వీరిలో గ్రామ సభ ద్వారా లబ్ధిదారులను 94మందిని ఎంపిక చేశారు. అయితే గ్రామంలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం 22 మంది నిజమైన లబ్దిదారులు ఉన్నారు.ఇక ఎస్సీ, ఎస్టీలకు 36 ఇండ్లు, మైనార్టీలకు 7 ఇండ్లు కేటాయించినట్టు అధికారులు చెప్పారు. అందుకు విరుద్దంగా ఎస్సి, ఎస్టీ లకు 22 ఇండ్లు, మైనార్టీలకు 7 ఇండ్లు కేటాయిస్తున్నట్టు లబ్దిదారులకు తెలియడంతో గ్రామ సభలో పెద్ద ఎత్తున అభ్యంతరం తెలిపారు. నిజమైన లబ్దిదారులను ఎంపిక చేస్తూ, ఆయా వర్గాలకు ఇచ్చిన ఇండ్లు వారికే ఇవ్వాలని సీపీిఐ(ఎం) నాయకులు తహసీల్దార్ కు వినతి పత్రం అందజేశారు. నిజమైన పేదలకు అందేలా చూస్తామని తహశీల్దార్ గ్రామస్తులకు హామీ ఇచ్చినట్లు గ్రామస్తులు తెలిపారు.లబ్ధిదారుల ఎంపిక జాబితా ఇవ్వడానికి అధికారులకు వస్తున్న అడ్డంకులు ఏంటో చెప్పాలని ప్రజాప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు.డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపులో అధికారుల నిర్లక్ష్యం,జాప్యం ఉంది.గ్రహణ పాటు వీడి లబ్దిదారులకు ఇండ్లు అందజేయాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి.ఇప్పటికైనా లబ్దిదారుల ఎంపిక పూర్తి చేసి తుది జాబితా రూపొందించి ఇండ్లు ఇవ్వాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
నిజమైన అర్హులను గుర్తించి వెంటనే ఇండ్లు ఇవ్వాలి.
- మీసాల శ్రీను, సీపీఐ (యం)మండల కమిటీ సభ్యులు
గ్రామంలో లబ్ధిదారుల ఎంపిక కోసం మూడు సార్లు గ్రామ సభ నిర్వహించారు.మొదటగా 120 మందిని,రెండో సారి 90మందిని ఎంపిక చేశారు.మూడో గ్రామసభ సమయంలో అనర్హులు ఉన్నారని గ్రామంలో అభ్యంతరం వ్యక్తం చేశారు.అనంతరం లబ్ధిదారులను పైనల్ చేస్తామని తహసీల్దార్ చెప్పారు.కానీ నేటికీ ఎలాంటి సమాచారం లేదు. త్వరగా లబ్ధిదారులను గుర్తించి,వెంటనే ఇండ్లు ఇవ్వాలి.
మూడు రోజుల్లో లబ్దిదారుల ఫైనల్ లిస్ట్ ఎంపిక
చౌటుప్పల్ తహసీల్దార్,శ్యామ్ సుందర్ రెడ్డి
మల్కాపురం గ్రామంలో ఇప్పటికి రెండు సార్లు గ్రామ సభ నిర్వహించాం. వచ్చిన దరఖాస్తుల్లో లబ్దిదారుల ఎంపిక పారదర్శకంగా జరిగేట్లు చూస్తున్నాం. ఆ గ్రామంలో ఉన్నవి 72 ఇండ్లు, రెండు గ్రామసభల ద్వారా గుర్తించినా లబ్దిదారులు 90 మందికి పైగా ఉన్నారు. మూడు రోజుల్లో గ్రామ సభ నిర్వహించి ఫైనల్ లిస్ట్ తయారు చేసి జిల్లా కలెక్టర్ కు అందజేస్తాం.