Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పోలీస్, రెవెన్యూ వ్యవస్థను విచ్ఛిన్నం చేసి పార్టీ కోసం వాడుకుంటున్నారు
అక్రమ కేసులు పెట్టి బెదిరింపులకు పాల్పడుతూ చేర్చుకుంటున్నారు
కాంగ్రెస్ పార్టీలో లింగారెడ్డి అన్ని పదవులు అనుభవించి పార్టీ వీడడం సరికాదు
నవతెలంగాణ-కోదాడరూరల్
మోతె మండలంలో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయిందని బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తున్న ప్రచారం అవాస్తవమని టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి సీిహెచ్.లక్ష్మీనారాయణరెడ్డి, మోతే మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కీసర సంతోష్‌రెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. మోతె మండలం మాజీ ఎంపీపీ లింగారెడ్డి కాంగ్రెస్ పార్టీలో అన్ని పదవులు అనుభవించి పార్టీ వీడడం సరికాదన్నారు. కాంగ్రెస్ పార్టీ లింగారెడ్డికి అన్ని విషయాల్లో పెద్దపీట వేసిందని, గౌరవించే పార్టీని వీడి గౌరవం లేని పార్టీలో చేరారని విమర్శించారు. ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ సీనియర్ నాయకులు చందర్రావులనే పక్కకు పెట్టారని లింగారెడ్డికి ముందు రాబోయే రోజుల్లో ఆ పార్టీ అంటే ఏమిటో తెలుస్తుందన్నారు. ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ టికెట్ రాదనే భయంతో అక్రమ అరెస్టులకు బెదిరింపులకు పాల్పడుతూ పలు పార్టీల నాయకులను బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకుంటున్నారని ఘాటుగా విమర్శించారు. శాండు ల్యాండ్ వైను వ్యాపారాల్లో భాగాలు ఇస్తామంటూ ప్రలోభాలకు గురి చేస్తూ పార్టీలో చేర్చుకుంటున్నారని అది నిజమైన పార్టీ బలం కాదని రాబోయే ఎన్నికల్లో నిజమేమిటో తెలుస్తుంది అన్నారు. ఎంపీ ఉత్తమ్ మాజీ ఎమ్మెల్యే పద్మావతి లపై ప్రెస్ మీట్ లు పెట్టి విమర్శించడం పరిపాటి అయిందని నియోజకవర్గంలో జరిగిన అభివద్ధి అంతా వారు ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడే జరిగిందేనన్నారు. గత ఎన్నికలో తాను ఎమ్మెల్యేగా గెలిస్తే 100 రోజుల్లో మోతే మండలానికి పాలేరు జలాలు అందిస్తానని ఇచ్చిన హామీ నాలుగేళ్లు దాటిన నేటి వరకు అమలు కాలేదని ఎద్దేవా చేశారు. నేటికీ మోతే, మునగాల, చిలుకూరు మండలాల రైతులు పొలాలకు నీళ్లు అందక ఇబ్బందులు పడుతున్నారని గుర్తు చేశారు. అధికార బలంతో పోలీసు రెవెన్యూ వ్యవస్థలను విచ్చినం చేసి అధికారులను పార్టీ కోసం వాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యకర్తలు బెదిరింపులకు లొంగవద్దని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అండగా ఉంటారన్నారు. అక్రమ కేసులు అరెస్టులు బెదిరింపులపై త్వరలో నియోజకవర్గ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామన్నారు. నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే చేస్తున్న అక్రమ వ్యాపారాలు బెదిరింపులపై అధిష్టానానికి అన్ని నివేదికలు అందయన్నారు. ఎంపీ ఉత్తమ్ కుమార్‌రెడ్డి ప్రకటించినట్లు కోదాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ 50 వేల మెజారిటీతో గెలుపు సాధిస్తుందన్నారు రాబోయే ఎన్నికల్లో కేంద్రంలో రాష్ట్రంలో రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది అన్నారు. ఈ సమావేశంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వంగవీటి రామారావు, మండల పార్టీ అధ్యక్షులు వరప్రసాద్ రెడ్డి,అనంతగిరి మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి,కిసాన్ సెల్ రాష్ట్ర కోఆర్డినేటర్ మధుసూధన్ రెడ్డి,లింగయ్య, పద్మ రెడ్డి,ఎల్లయ్య, లింగయ్య తదితరులు పాల్గొన్నారు.