Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జెడ్పీచైర్పర్సన్ దీపిక యుగంధర్ రావు
నవతెలంగాణ-తుంగతుర్తి
గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పల్లె దవఖానాలను అందుబాటులోకి తీసుకొచ్చిందని జడ్పీ చైర్పర్సన్ గుజ్జ దీపిక యుగంధర్ రావు అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని వెంపటి గ్రామంలో రూ.10 లక్షల వ్యయంతో నిర్మించిన పల్లె దవాఖాన,రూ .10 లక్షల వ్యయంతో మత్స్య పారిశ్రామిక సహకార సంఘం భవనంతో పాటు గ్రామీణ క్రీడా ప్రాంగణం,పల్లె ప్రకతి వనాన్ని ఆమె ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... గతంలో వైద్యం చేయించుకోవాలంటే పట్టణ ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేందన్నారు. తెలంగాణ ప్రభుత్వ హయాంలో గ్రామీణ ప్రాంతాల్లోనే పల్లె దవాఖానాలను ఏర్పాటు చేసి, మెరుగైన వైద్య సదుపాయం కల్పిస్తున్నట్లు తెలిపారు. అన్ని వర్గాల ప్రజలకు సముచిత న్యాయం కల్పిస్తూ గ్రామీణ ప్రాంతాల్లో కమ్యూనిటీ హాళ్లను నిర్మిస్తున్నట్లు చెప్పారు. గ్రామీణ యువతకు అందుబాటులో ఆట స్థలాలను ఏర్పాటు చేయడంతో పాటు, పట్టణాలకు తీసిపోకుండా గ్రామీణ ప్రాంతాల్లో కూడా పకతి వనాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిందన్నారు.గత ప్రభుత్వాలు చేయని అభివద్ధి, సంక్షేమ పథకాలను బీఆర్ఎస్ ప్రభుత్వం చేసి చూపుతోందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గుండగాని కవిత రాములు గౌడ్, జిల్లా వైద్యాధికారి డాక్టర్ కోటాచలం,ఉమ్మడి నల్లగొండ జిల్లా డిసిఎంఎస్ డైరెక్టర్ గుడిపాటి సైదులు, మండల వైద్యాధికారి డాక్టర్ నాగు నాయక్,స్థానిక సర్పంచ్ అబ్బగాని పద్మ సత్యనారాయణ గౌడ్, ఎంపీటీసీ గుండగాని వీరస్వామి, ఎంపీడీవో భీమ్ సింగ్, డి ప్రభాకర్, ఏఈ ప్రభు కిరణ్, గ్రామ కార్యదర్శి శ్రీధర్,ఉప సర్పంచ్ భాష బోయిన వెంకన్న, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తాటికొండ సీతయ్య, ప్రధాన కార్యదర్శి కటకం వెంకటేశ్వర్లు, జిల్లా నాయకులు గుండగాని రాములు గౌడ్,మాజీ సర్పంచులు తునికి సాయిలు, కొండగడుపుల నాగయ్య, తదితరులు పాల్గొన్నారు.