Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హుజూర్నగర్ టౌన్
అర్హులైన పేదలందరికీ ఇండ్లు దక్కెంతవరకు పోరాటాలు సాగిస్తామని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలోని తహసిల్దార్ కార్యాలయం ముందు సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, స్థలాలు ఉన్నవారికి ఇంటి నిర్మాణానికిగాను రూ. 5 లక్షలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా పట్టణంలో సుమారు 4000 మంది ఇల్లు లేని నిరుపేదలు అద్దె ఇండ్లలో జీవనం సాగిస్తూ ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పట్టణ సమీపంలోని రామస్వామి గట్టు వద్ద గల రెండువేల ఇండ్ల నిర్మాణాలను పూర్తి చేసి నిరుపేదలకు పంపిణీ చేయాలన్నారు. అనేక పోరాటాల అనంతరం అసంపూర్తిగా ఉన్న ఈ ఇండ్ల నిర్మాణానికి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసినందున వెంటనే పనులు చేపట్టాలన్నారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కార్యాలయంలో అందజేశారు. ఆ పార్టీ పట్టణ కార్యదర్శి నాగారపు పాండు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు పల్లె వెంకటరెడ్డి, దుగ్గి బ్రహ్మం, నరసింహారావు, మండల కార్యదర్శి పీ.హుస్సేన్, నాయకులు శీలం శ్రీను, రేపాకుల మురళి, ఎలక సోమయ్య , కౌన్సిలర్ ఇందిరాల త్రివేణి, చిన్నం వీరమల్లు, రేపాకుల వీరస్వామి, శీలం వెంకన్న, పర్వతాలు, సాంబయ్య, వీరబాబు, శ్రీను, సాంబయ్య, వెంకటరెడ్డి, సైదమ్మ తదితరులు పాల్గొన్నారు.
కోదాడరూరల్ : అర్హులైనపేద ప్రజలకు కార్మికులకు డబల్ బెడ్ రూమ్ ఇండ్లను మంజూరు చేయాలని రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మెదరమెట్ల వెంకటేశ్వరావు, సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు ఎం.ముత్యాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం పట్టణంలో ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. అనంతరం మున్సిపల్ కార్యాలయ మేనేజర్ రమేష్‌కు మెమోరాండం అందించారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల ఐక్యవేదిక నాయకులు డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు కాసాని కిషోర్, రైతు సంఘం నాయకులు సిహెచ్.భీమయ్య, శరభందరరెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ఏసోబు, శ్రీనివాస్, సంగమయ్య, సీఐటీయూ నాయకులు గంటా నాగరాజు, మన్యం లింగయ్య, కాటయ్య, సైదులు, రాములు, తదితరులు పాల్గొన్నారు.
సూర్యాపేట : అర్హులైన పేదలందరికీ ఇండ్లు, ఇండ్ల స్థలాలు ,డబల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి నెమ్మాది వెంకటేశ్వర్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజా సంఘాల పోరాట వేదిక రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా శుక్రవారం స్థానిక తహసిల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇండ్లు, ఇండ్ల స్థలాలు ,డబల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం మండల వ్యాప్తంగా ుూడు సంవత్సరాలుగా ఆందోళన చేస్తున్నప్పటికీ ప్రభుత్వం, అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు..1994 నుండి 2000 సంవత్సరం వరకు గత ప్రభుత్వ ల హయాంలో పేదల ఇళ్ల స్థలాల కోసం గుడిసెలు వేసుకున్న వారికి ఇండ్ల స్థలాలకు వెంటనే పట్టాలు ఇచ్చి పేదల ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు కేటాయించాలని డిమాండ్ చేశారు. అనంతరంతహసీిల్దార్ శ్రీనివాస్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) కార్యదర్శి వర్గ సభ్యులు కొలిశెట్టి యాదగిరి రావు, కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి కోట గోపి, గీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఎలుగురి గోవింద్,మహిళా సంఘం జిల్లా కార్యదర్శి మేకర బోయిన సైదమ్మ ,రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యురాలు సీఐటీయూజిల్లా అధ్యక్షుడు రాంబాబు, కొప్పుల రజిత, మేకన బోయిన శేఖర్, టౌన్ కన్వీనర్ మామిడి సుందరయ్య,వల్లపు దాసు సాయికుమార్, అర్వపల్లి లింగయ్య, నాగరాజు, ఉస్సు తదితరులు పాల్గొన్నారు.
మోతే : అర్హులైన పేదలందరికీ ఇండ్లు ఇండ్ల స్థలాలు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టి పెల్ల్లి సైదులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు .శుక్రవారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇండ్లు ఇండ్ల స్థలాలు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం మూడు సంవత్సరాలుగా శాంతియుతంగా ఆందోళన చేస్తున్నప్పటికీ ప్రభుత్వం, అధికారులు నిమ్మకు నిరీత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు .మండల కేంద్రముతో పాటు ఇవ్వాళ పురం, అప్పన్నగూడెం గ్రామాలలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం పేదలు దరఖాస్తు చేసుకున్నప్పటికీ నేటికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పంపిణీ చేయకపోవడం విచారకరమన్నారు .అనంతరం తహసీల్దార్ యాదగిరి కి వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో జిఎస్ చర్లపల్లి వెంకన్న సతీష్ రెడ్డి పాల్గొన్నారు.
నూతనకల్ : అర్హులైన నిరుపేదలకు ఇండ్లు ఇళ్ల స్థలాలను వెంటనే ఇవ్వాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కందాల శంకర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ శ్రీధర్ కి వినతి పత్రం అందజేశారు అనంతరం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీలలో భాగంగా అర్హులైన పేదవారికి వెంటనే డబల్ బెడ్ రూమ్‌ను నిర్మించి ఇవ్వాలని మండల పరిధిలోని అమలు అయి అసంపూర్తిగా నిర్మాణంలో ఉన్న డబల్ బెడ్ రూములను కాంట్రాక్టు దారులు వెంటనే నిర్మాణం చేపట్టాలని, ఇళ్ల స్థలాలు ఉన్న పేదలకు ఇంటి నిర్మాణం కోసం నగదును వెంటనే అందజేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు .ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు అంజపెళ్లి లక్ష్మయ్య సిఐటియు మండల నాయకులు బొజ్జ శీను రైతు సంఘం నాయకులు కందాల కష్ణారెడ్డి బాలగాని సోమయ్య మందడి చంద్రారెడ్డి ఉప్పల్ రెడ్డి యువజన సంఘ నాయకులు బొజ్జ విజరు ఇరుగు రమేష్ బత్తుల తిరుమలేష్ గొర్ల మేకల సంఘం మండల అధ్యక్షులు లింగయ్య తదితరులు పాల్గొన్నారు.