Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ -నేరేడుచర్ల
పాత నేరేడుచర్లలో ఉన్న డంపింగ్ యార్డ్‌ను వెంటనే ఎత్తివేయాలని ఒకటో వార్డు కౌన్సిలర్ కొనతం చిన్న వెంకటరెడ్డి, 8వ వార్డు కౌన్సిలర్ కొదమగుండ్ల సరిత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.శుక్రవారం నేరేడుచర్ల విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గతంలో కమలానగర్, శాంతినగర్, పాత నేరేడుచర్ల ప్రజలందరూ కలిసి ఎక్కడినుండి సేకరించిన చెత్త, వ్యర్థ పదార్థాలు తీసుకువచ్చి జనావాసాల దగ్గర ఉన్న పాత నేరేడుచర్ల లోని డంపింగ్ యార్డ్‌లో వేయటం ఏంటని పలుమార్లు ప్రశ్నించారు. ఇక్కడి ప్రజలు రోజువారి కూలీలుగా వ్యవసాయ ఆధారితంగా జీవనం గడుపుతున్న గ్రామాలని, గతంలో అనేక సందర్భాల్లో గౌరవ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి దష్టికి, జిల్లా కలెక్టర్ దష్టికి తీసుకెళ్లామని, గతంలో వారు డంపింగ్ యార్డ్ చుట్టూ ప్రహరీ గోడ నిర్మిస్తామని డంపింగ్ యార్డులో చెత్తను రీసైక్లింగ్ చేసి ఎక్కడికక్కడ దుర్వాసన గాని, ఈగలు దోమలు, పొగ రాకుండా ప్రజారోగ్యానికి ఇబ్బందులు కలగకుండా చూస్తామని హామీలు ఇచ్చి సంవత్సరం గడుస్తున్న ఇప్పటివరకు ఎలాంటి పనులు చేపట్టలేదని కావున డంపింగ్ యార్డు ను ప్రజా ఆరోగ్యం దష్ట్యా వెంటనే ఎత్తివేయాలని లేనిపక్షంలో రాజకీయాలకతీతంగా ఈ మూడు గ్రామల ప్రజలతో కలిసి మునిసిపల్ కార్యాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు. పాత నేరేడుచర్లలో కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మిస్తున్న వైకుంఠధామం పనులకు శంకుస్థాపన చేసి సంవత్సరం నర గడుస్తున్నా ఇప్పటికీ పని పూర్తి అవ్వలేదని, ఎందుకు పూర్తవ్వలేదని కాంట్రాక్టర్ ని గట్టిగా నిలదీయగా కోటి రూపాయలు ఖర్చుపెట్టి పనులు చేసినప్పటికీ ప్రభుత్వం నుంచి నయా పైస రాలేదని అందుకే పనులు ఆపేశామని తెలిపారన్నారు. జిల్లా కలెక్టర్ మరియు అధికారులు వచ్చి పరిశీలించి వెళ్ళారే తప్ప ఇప్పటివరకు పనులు పునర్నిర్మానం చేపట్టలేదని, పాత స్మశాన వాటిక స్థలంలోనే ఇప్పుడు వైకుంఠధామం నిర్మిస్తున్నందువలన ఈ మూడు గ్రామాల ప్రజలలో ఎవరైనా చనిపోయినట్లయితే స్మశాన వాటికలో చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని వెంటనే వైకుంఠధామం పనులు త్వరితగతిన పూర్తి చేయాలని లేనియెడల గ్రామ ప్రజలతో కలిసి కార్యచరణ రూపొందిస్తామన్నారు.