Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నకిరేకల్
నకిరేకల్ మున్సిపాలిటీ తో పాటు మండలంలోని వివిధ గ్రామాలలో అర్హులైన నిరుపేదలకు ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రజా సంఘాల ఐక్య పోరాట వేధిక ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక తహసీిల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కందాల ప్రమీల, కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు రాచకొండ వెంకట్ గౌడ్ మాట్లాడారు. సొంత స్థలం ఉన్నవారికి ఇంటి నిర్మాణం చేసేందుకు ప్రభుత్వం మూడు లక్షలు ఇస్తామని చేసిన వాగ్దానాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. పెరిగిన ధరలకు అనుగుణంగా ఇంటి నిర్మాణం కోసం రూ. 3 నుండి రూ. 5 లక్షలకు పెంచాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు మర్రి వెంకటయ్య, కొప్పుల అంజయ్య, మర్రి బక్కయ్య, లగిశెట్టి శ్రీనివాస్, పుట్ట సత్తయ్య, అదిరాల దుర్గారావు, బహు రోజు ఇందిర, నాగమణి, శశికళ, గింజల లక్ష్మి, పాలడుగు పరమేశ్, ఎరుకల అంజయ్య, వంటపాక కష్ణ, బొడ్డుపల్లి లక్ష్మీ, నరసయ్య, తుమ్మల వెంకటయ్య, మర్రి ఎల్లయ్య, బండి మీది ఎల్లయ్య పాల్గొన్నారు.
మునుగోడు : సొంత ఇంటి స్థలం కలిగి ఉన్న నిరుపేదలందరికీ ప్రభుత్వం ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బండ శ్రీశైలం డిమాండ్ చేశారు. శుక్రవారం మండల కేంద్రంలోని తాసీల్దార్ కార్యాలయం ముందు ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని తాసీల్దార్ కష్ణారెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా బండ శ్రీశైలం మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం సొంత ఇంటి స్థలం ఉన్నవారికి 3 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పడం సరికాదన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా తక్షణమే ప్రభుత్వం ఐదు లక్షల రూపాయలు పెంచాలని డిమాండ్ చేశారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి నిరుపేదలందరికీ ఇళ్ల నిర్మాణం కోసం ఐదు లక్షల రూపాయలు ఇచ్చి, నిరుపేదలను ఆదుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ మండల కన్వీనర్ వరికుప్పల ముత్యాలు, రైతు సంఘం నాయకులు సాగర్ల మల్లేష్, వడ్లమూడి హనుమయ్య, సీిహెచ్.వీరమల్లు, నారబోయిన నరసింహ, బొందు అంజయ్య, మాజీ సర్పంచ్ సింగపంగా గౌరయ్య, బోడిసే సత్తయ్య, బొందు ముత్యాలు, సీిహెచ్ .రజిత, ఇరగదిండ్ల ఇద్దయ్యా, పగిళ్ల సైదులు, జీడిమెట్ల సైదులు తదితరులున్నారు.
చండూర్ : ఇంటి స్థలం ఉన్న నిరుపేదలకు 5 లక్షల రూపాయలు ఇవ్వాలని కోరుతూ చండూర్ ఎమ్మార్వో కార్యాలయం ముందు ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ధర్నానిర్వహించి, డిప్యూటీ తహసిల్దార్ గణేష్‌కు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్బంగా తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బండ శ్రీశైలం మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి మొగుదాల వెంకటేశం, తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి జెర్రిపోతుల ధనుంజయగౌడ్, సీఐటీయూ జిల్లా నాయకులు చిట్టిమల్ల లింగయ్య, నాయకులు పాశం లింగయ్య, మున్సిపల్ అధ్యక్షులు ఏ.చిన్న వెంకన్న, మండల కమిటీ సభ్యులు గౌసియా బేగం, ప్రజా సంఘాల నాయకులు నారపాక శంకరయ్య, బొందు సైదులు, నారపాక నరసింహ, జెర్రిపోతుల లింగమ్మ, సైదమ్మ, కలమ్మ, మనోహర, తదితరులు పాల్గొన్నారు.
గట్టుప్పల్‌లో....
నిరుపేదలకు ఇంటి స్థలం ఉన్న వారికి 5 లక్షలు రూపాయలు ఇవ్వాలని ప్రజాసంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తూ గట్టుప్పల్ మండల కేంద్రంలో తాసీిల్దార్ కార్యాలయం ముట్టడి చేశారు. ధర్నా నిర్వహించి డిప్యూటీ తాసీల్దార్ ఎండీ.హుస్సేన్‌కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు చాపల మారయ్య మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) గట్టుపల్ మండల ప్రధాన కార్యదర్శి కర్నాటి మల్లేశం, కేవీపీఎస్ జిల్లా సహాయ కార్యదర్శి బొట్టు శివకుమార్, కాకునూరి నాగేష్, దోటిశేఖర్, అచ్చిన శ్రీనివాసులు, వల్లూరి శ్రీశైలం, ఖమ్మం రాములు, ఎండీ. రబ్బాని తదితరులు పాల్గొన్నారు.
నల్లగొండ రూరల్ : అర్హులైన పేదలందరికీ ప్రభుత్వం ఇండ్లు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని ఆవాజ్, కేవీపీఎస్, ఐద్వా, జిల్లా కార్యదర్శిలు సయ్యద్ హాశమ్, పాలడుగు నాగార్జున, ప్రభావతి, సీఐటీయూ, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం, డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు ఎండీ. సలీం, దండంపల్లి సరోజ, గుండాల నరేష్, ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం నల్లగొండ మండల తాసీల్దార్ కార్యాలయం ముందు తెలంగాణ ప్రజా సంఘాల పోరాట వేదిక ఆధ్వర్యంలో ధర్నా చేసి తహసీల్దార్ మందడి నాగార్జునరెడ్డికి వినతిపత్రం అందజేశారు. ధర్నా అనంతరం జరిగిన సభలో వివిధ సంఘాల నాయకులు మాట్లాడుతూ గత ఎనిమిది సంవత్సరాలుగా తెలంగాణ ప్రభుత్వం ఒక్కరికి కూడా ఇండ్లుగాని, ఇండ్ల స్థలంగాని ఇవ్వకుండా మాటలతో కాలయాపన చేస్తుందని ఆరోపించారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించి మౌలిక సదుపాయాలు కల్పించకుండా, పంపిణీ చేయకుండా వదిలి వేయడంతో శిథిలావస్థకు చేరి అసాంఘిక కార్యక్రమాలకు నిలయాలుగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే మౌలిక సదుపాయాల కోసం నిధులు కేటాయించి అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పూర్తి చేసి అర్హులకు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. నల్లగొండ పట్టణానికి జీవనోపాధి కోసం వేలాదిమంది వలసలు వచ్చి అద్దె ఇండ్లలో ఉంటూ చాలీచాలని వేతనాలతో జీవనం గడుపుతున్న పట్టణ పేదలకు ప్రభుత్వం భూమి కొనుగోలు చేసి 120 గజాల చొప్పున పంపిణీ చేసి ఇండ్ల నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అర్హులైన పేదలందరికీ ఇండ్లు ఇండ్ల స్థలాలు, ఇంటి నిర్మాణనికి ఐదు లక్షల ఆర్థిక సహకారం చేయాలని కోరుతూ ఫిబ్రవరి 9న ఇందిరాపార్క్ దగ్గర జరిగే మహా ధర్నాకు ఇల్లు లేని పేదలంతా పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. ధర్నా అనంతరం జరిగిన సభకు సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య అధ్యక్షత వహించన ఈ కార్యక్రమంలో సీఐటీయూ, ఐద్వా, డివైఎఫ్ఐ, వ్యవసాయ కార్మిక సంఘం, కేవీపీఎస్, ఆవాజ్, వత్తి సంఘాల నాయకులు భూతం అరుణకుమారి, పాలాది కార్తీక్, రుద్రాక్ష యాదయ్య,సలివోజు సైదాచారి, కొండ వెంకన్న, పోలె సత్యనారాయణ, బొల్లు రవీందర్, రుద్రాక్షి శేఖర్, అన్నాభిమోజు పద్మ, దండెంపల్లి యాదయ్య, విజరు కుమార్, తదితరులు పాల్గొన్నారు.
చిట్యాల టౌన్ : అర్హులైన పేదలందరికీ డబల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని కేవీపీఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు జిట్ట నగేష్, జీఎంపీఎస్ జిల్లా కార్యదర్శి అవిశెట్టి శంకరయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చిట్యాల తహసిల్దార్ కార్యాలయం ముందు శుక్రవారం వ్యవసాయ కార్మిక సంఘం, మహిళా, సీఐటీయూ వివిధ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో జరిగిన ధర్నా కార్యక్రమానికి వారు హాజరై మాట్లాడారు. చిట్యాల గుండ్రాంపల్లి గ్రామాల్లో పూర్తయిన డబల్ బెడ్రూమ్ ఇండ్లను వెంటనే పంపిణీ చేయాలని కోరారు. మండలంలోని నేరడ, ఉరుమడ్ల, వట్టిమర్తి, చిన్నకాపర్తి, తాళ్ల వెల్లంల గ్రామాలలో పేదల ఇండ్ల స్థలాల కోసం ప్రభుత్వం కొనుగోలు చేసిన భూమిలో ఇండ్ల పట్టాలు చేసి పేదలకు అందజేయాలని కోరారు. ఇంటి స్థలం ఉన్న పేద కుటుంబాల వారికి ప్రభుత్వం ఇండ్ల నిర్మాణం కోసం ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సహకారం అందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. తక్షణమే పేదలందరికీ ఇండ్లు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయకపోతే ఆందోళన పోరాటాలు ఉదతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం తహశీల్దార్ శ్రీనివాస్‌కు వినతి పత్రం అందజేశారు. కత్తుల లింగస్వామి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ ప్రజా సంఘాల నాయకులు జిట్ట సరోజ, నారబోయిన శ్రీనివాస్, మెట్టు నరసింహ, కల్లూరి కుమారస్వామి, లోడె విష్ణుమూర్తి, జోగు లక్ష్మయ్య, పంది నరేష్, పాల లక్ష్మయ్య, కోనేటి యాదయ్య, యల్లం వీరయ్య, శ్రీనివాస్, శ్రీదేవి, నాగమ్మ, కిషన్ తదితరులు పాల్గొన్నారు.
నాంపల్లి : ఇంటి స్థలం ఉన్న నిరుపేదలకి గహ నిర్మాణం కోసం 5 లక్షల రూపాయలు ఇవ్వాలని శుక్రవారం నాంపల్లి తహసీల్దార్ కార్యాలయం ముందు ప్రజా సంఘాలు, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, సీఐటీయూ, ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి, తహసిల్దార్ చిలుకూరి లాల్ బహుదూర్‌కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షుడు నాంపల్లి చంద్రమౌళి మాట్లాడుతూ సొంత ఇంటి స్థలం కలిగి ఉన్న నిరుపేదలందరికీ ప్రభుత్వం ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి కొమ్ము లక్ష్మయ్య, రైతు సంఘం మండల నాయకులు పగిళ్ల యాదయ్య, సీఐటీయూ నాయకులు గాదెపాక మరియమ్మ, ఏదుల్ల వెంకట్, ఈరమ్మ, సులోచన, లక్ష్మమ్మ, రమణమ్మ, పార్వతమ్మ, మహేశ్వరం అనిల్, కామిశెట్టి శ్రీకాంత్, జిల్లాల మహేష్, ఆనంద్, మద్దెల గీత, కాశీమల్ల రజిత, బీ.వనజ తదితరులు పాల్గొన్నారు.
పెద్ద అడిశర్లపల్లి : కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఇండ్లు లేని నిరుపేదలందరికీ ఇంటి స్థలం ఇచ్చి, ఇంటి నిర్మాణానికి రూ.10 లక్ష లు అందించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కంబాలపల్లి ఆనంద్ డిమాండ్ చేశారు. శుక్రవారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో నాయబ్ తాసీల్దార్ ధవ కుమారుకు వినతి పత్రం అందజేసి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కేవపీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు పెరిక విజరు కుమార్, మండల అధ్యక్షుడు మండల రాజశేఖర్, రైతు సంఘం మండల అధ్యక్షుడు ధర్మపురం దేవయ్య తదితరులు పాల్గొన్నారు.
మర్రిగూడ : ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఉన్న నిరుపేదలను గుర్తించి ప్రభుత్వం ప్రకటించిన 3 లక్షలకు బదులుగా ఐదు లక్షల రూపాయలు చెల్లించి పేదవారి సొంతింటి కలను నెరవేర్చాలని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి ఏర్పుల యాదయ్య అన్నారు. శుక్రవారం మర్రిగూడ మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తాసీల్దార్ తారకరామన్కు వినత పత్రాన్ని అందజేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కమిటీ సభ్యులు కొట్టం యాదయ్య, ఉప్పునూతల వెంకటయ్య, సీఐటీయూ మండల ఉపాధ్యక్షురాలు పెరమండ్ల మంజుల, అమరబాద్ సునీత, ఊరుపక్క వెంకటయ్య, ఎడ్ల నరసింహ, రాధిక, రాఘవేంద్ర, గిరి, చిన్న యాదమ్మ, ఈశ్వరమ్మ, తదితరులు పాల్గొన్నారు.
దేవరకొండ : పేదలందరికీ డబల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేయాలని సీపీఐ(ఎం)మండల కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కార్యదర్శి నల్ల వెంకటయ్య మాట్లాడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా అర్హులైన పేదలందరికీ రెండు పడకల గదుల, ఇంటి స్థలాలు, ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం ఇండ్ల స్థలం కలిగిన వారికి ఐదు లక్షల రూపాయలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఎన్నికల హామీలను అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ నాయకులు బిజిలి లింగయ్య, ఎండీ. రహీం, మైనం నరసింహ, శివలింగం, వసుకుల వెంకటమ్మ, భారతమ్మ, లావణ్య, లక్ష్మమ్మ, ముత్తమ్మ, ఎస్ఎఫ్ఐ నాయకులు బుడిగా వెంకటేష్, రాహుల్, శ్రావణ్, తదితరులు పాల్గొన్నారు.