Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి
నవతెలంగాణ -మోతే
బీఆర్ఎస్తోనే దేశాభివద్ధి సాధ్యమవుతుందని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. గురువారం మండల పరిధిలోని మామిళ్లగూడెం రామదాసు ఫంక్షన్ హాల్లో ఆ పార్టీ మండల అధ్యక్షులు శీలం సైదులు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ చెందిన మాజీ ఎంపీపీ ఆరే లింగారెడ్డి తో పాటు కొంతమంది ఆ పార్టీనాయకులు బీఆర్ఎస్లో చేరారు. వారికి మంత్రి, ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌తో కలిసి పార్టీ లోకి ఆహ్వానించి కండువాలు కప్పారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి బీఆర్ఎస్ పార్టీ ఉద్భవించిందన్నారు. దేశ ప్రజల ఆకాంక్షల కు ఆమోదయోగ్యంగా పరిపాలన చేయడంలో మోడీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. దేశంలో రాజకీయ ప్రలోభాలు లేని రాష్ట్రమంటే తెలంగాణ ఏ అన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్న నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని కట్టడి చేయడంలో కాంగ్రెస్ పార్టీ చేతులెత్తేసిందన్నారు .తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చేవా చచ్చిన మాదిరిగా ఉందన్నారు. ప్రధానమంత్రి మోడీ ఏజెంటుగా రాహుల్ గాంధీ మారడం సిగ్గుచేటు అని విమర్శించారు. రాష్ట్రంలో రైతు బంధువు దళిత బంధువు, కల్యాణ లక్ష్మి షాద్ ముబారక్ పథకాలు అమలు చేస్తూ దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలిచిందన్నారు. కేసీిఆర్ పాలన శ్రీరామరక్షాన్ని దేశ ప్రజలు కోరుకుంటున్నారన్నారు. రాష్ట్ర అభివద్ధి ఫలాలను గమనించిన దేశ ప్రజలు బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారన్నారు. కేసీఆర్ చేసే యజ్ఞంలో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ మాట్లాడుతూ గతంలో మోతే మండలం ఒకప్పడు ఎడారిగా ఉండేదని, రాష్ట్రం ఆవిర్భావం తర్వాత గోదావరి జలాలతో పంట పొలాలు సస్యశ్యామలముగా మారాయని సంతోషం వ్యక్తం చేశారు .మంత్రి జగదీశ్ రెడ్డి సూర్యాపేట నియోజకవర్గం తో పాటు కోదాడ నియోజకవర్గం తన సహాయ సహకారాలు అందించి ఆదుకోవాలని కోరారు. ఈ సమావేశంలో పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.