Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్ ఎస్.వెంకట్రావు
నవతెలంగాణ -చివ్వేంల
శ్రీ లింగమంతుల స్వామి జాతరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని కలెక్టర్ ఎస్.వెంకట్రావు అన్నారు. శుక్రవారం పెద్ద గట్టు జాతర ప్రదేశాలను ్ల కలెక్టర్ ఎస్పీ రాజేంద్రప్రసాద్, జిల్లా అదనపు కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ సంబంధిత అధికారులతో కలిసి సందర్శించారు. జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం గట్టు వద్ద సంబంధిత అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జాతరకు వచ్చు భక్తులకు ముఖ్యంగా తాగునీరు, శానిటేషన్ విషయంలో తగు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. శ్రీ లింగమంతుల స్వామి దేవాలయాలకు వచ్చు ప్రాంతాలు చుట్టు ఫ్లవర్ డెకరేషన్, ప్లాంటేషన్ చేయాలని, దేవాలయ ప్రాంగణాన్ని విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించాలని పేర్కొన్నారు. జాతరకు విధులు నిర్వహించే దేవస్థాన సిబ్బంది వివరాలను ఈవో కుశలయ్య ను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. పోలీసు బందోబస్తు వివరాలను, పార్కింగ్ వివరాలు జాతర సమయంలో ట్రాఫిక్ మళ్లింపు వివరాలను జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ వివరించారు. జాతర సందర్భంగా 5, 6 తేదీలకు సూర్యాపేటలోని పాఠశాలలకు సెలవుదినంగా ప్రకటించారు. అన్ని పార్కింగ్ స్థలాలలో తాత్కాలిక టాయిలెట్స్ , త్రాగునీరు ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశించారు. నాలుగు పార్కింగ్ స్థలాలో 4 గురు సానిటరీ ఇన్స్పేక్టర్ విధులు కేటాయించాలని నిరంతరం పరిరక్షించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దగట్టు ఆలయ కమిటీ చైర్మన్ కోడి సైదులు యాదవ్, ఆర్డీవో రాజేంద్ర కుమార్, డిఎస్పి నాగభూషణం, డీఆర్డీఓపీడీ కిరణ్ కుమార్, డిస్ట్రిక్ట్ ఎంప్లాయిమెంట్ అధికారి మాధవరెడ్డి ,సిపిఓ వెంకటేశ్వర్లు, డిపిఓ యాదయ్య, రోడ్డు భవనాల అధికారి యాకుబ్, మిషన్ భగీరథ అధికారి వెంకటేశ్వర్లు, తహసీల్దార్ రంగారావు ,అధికారులు, సిబ్బంది ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.