Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరి బాలరాజు
నవతెలంగాణ-మోత్కూర్
బాధ్యతాయుతంగా సమాజంలో ఉన్న సమస్యలను నిర్భయంగా ప్రజల ముందుంచుతున్న పత్రికా ప్రతినిధులపై దాడులు చేసి పత్రికా స్వేచ్ఛ హరించే వారి పట్ల అధికారులు కఠినంగా వ్యవహరించాలని, దాడికి పాల్పడిన వారిని చట్ట ప్రకారం శిక్షించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాటూరి బాలరాజు, జిల్లా కమిటీ సభ్యులు బొల్లు యాదగిరి డిమాండ్ చేశారు. మోత్కూరు లో శుక్రవారం మోత్కూర్ లో రిపోర్టర్ యాదగిరి, కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆరోపణలు వచ్చిన ప్రజా ప్రతినిధులు తమ నిజాయితీని ప్రజల ముందు నిరూపించుకోవాలన్నారు. ఏవైనా ఆరోపణలు వస్తే పత్రికా ముఖంగా ఖండించాలే తప్ప పత్రికా ప్రతినిధుల ఇండ్ల పై దాడులు చేసి భయబ్రాంతులకు గురిచేయడం దుర్మార్గమన్నారు. ఇలాంటి ఘటనలు పునరావతం కాకుండా దాడికి పాల్పడిన వారిని, దాడికి ప్రేరేపించిన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఎం పార్టీ మండల కార్యదర్శి గుండు వెంకటనర్సు, పట్టణ కార్యదర్శి కూరపాటి రాములు పాల్గొన్నారు.
జర్నలిస్టులను వేధించడం హేయమైన చర్య
మోత్కూర్ నవతెలంగాణ రిపోర్టర్ పై దాడి చేయడం హేయమైన చర్య అని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు బుర్రు అనిల్ కుమార్, మండల అధ్యక్షుడు ఇంజ ప్రశాంత్ అన్నారు. శుక్రవారం మోత్కూర్ లో వారు దాడికి గురైన రిపోర్టర్ యాదగిరిని పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా స్వామ్యయుతంగా నిజాన్ని నిర్భయంగా ప్రజల ముందుకు తెస్తున్న పత్రికా ప్రతినిధి పై దాడి హేయమైన చర్య అని తీవ్రంగా ఖండించారు. ఆరోపణలను ప్రజాస్వామ్య యుతంగా ఖండిచాలి తప్ప ఇంటిపై దాడికి పాల్పడి భయబ్రాంతులకు గురి చేయడం సరికాదన్నారు. ఇలాంటి దాడులు పునావతం కాకుండా దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని
మోత్కూరు మున్సిపల్ కేంద్రానికి చెందిన రిపోర్టర్ యాదగిరిపై దాడికి పాల్పడిన వారిని కఠినంగాశిక్షించాలని డిమాండ్ చేస్తూ టీయూడబ్ల్యూజే హెచ్ 143 సంఘం మండల నాయకులు మోత్కూరు తహసీల్దార్ షేక్ అహ్మద్ కు వినతి పత్రాన్ని అందించారు. జర్నలిస్టు పై దాడి చేయడం హేయమైన చర్య అని, జర్నలిస్టులపై దాడులు పునరావతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని వినతి పత్రంలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే హెచ్ -143 నాయకులు శ్రీహరి, ప్రదీప్, వెంకటేష్, ఇర్ఫాన్, రాములు, రమేష్, విష్ణు, యాదగిరి, రాజు పాల్గొన్నారు.