Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎప్పుడు వస్తదో.. ఎప్పుడు పోతదో..
- వినియోగదారుల సేవా కేంద్రంలో తప్పని తిప్పలు
నవతెలంగాణ-నార్కట్పల్లి
బ్యాంకింగ్ సేవలను ప్రతి ఒక్కరికి అందుబాటులో తేవాలని గ్రామీణ ప్రాంతాల వారు బ్యాంకుకు వెళ్లి సేవలను వినియోగించుకోలేకపోతున్నారనే ఉద్దేశంతో ఆర్బీఐ వినియోగదారుల సేవా కేంద్రాలను గ్రామీణ ప్రాంతాల్లో అందుబాటులోకి తెచ్చింది. లక్ష్యం ఘనమైనప్పటికీ అమల్లోకి వచ్చేసరికి బ్యాంకు సర్వర్ చాలా స్లోగా కొనసాగుతుంది. వినియోగదారులు తమ ఖాతాలలో క్రయవిక్రయాలు జరిపేందుకు వినియోగదారుల సేవా కేంద్రానికి వెళ్తున్న క్రమంలో బ్యాంకు సర్వర్ వేరీ స్లోగా ఉండడంతో గంటల తరబడి క్యూలో నిలబడాల్సిన పరిస్థితి ఉంది. వినియోగదారుల సేవా కేంద్రం నిర్వాహకులు ఒక్కొక్క వినియోగదారునికి ఒక్కొక్కసారి ఆ సైట్ను ఉపయోగించాల్సి వస్తుంది. ఒక వినియోగదారునికి ఉపయోగించిన తర్వాత అక్కడికి నిలిచిపోతుంది. దీంతో ఒక్కొక్క వినియోగదారుడికి 15 నిమిషాలపైగా సమయం తీసుకుంటుంది. వినియోగదారుల సేవా కేంద్రంలో వినియోగదారులు, నిర్వాహకులు ఇబ్బంది పడుతున్నారు.
వినియోగదారుల సేవా కేంద్రంలో తప్పని తిప్పలు
వినియోగదారుల సేవా కేంద్రంలో ఆధార్ కార్డు ద్వారా ప్రతిరోజు 10 వేల రూపాయలు విత్ డ్రా చేసుకోవడం, సమ భావన సంఘాలకు సంబంధించిన రుణాలు చెల్లించుకోవడం, ఇతర ప్రాంతాలకు సులువుగా డబ్బులు పంపించమని సేవా కేంద్రాల్లో వినియోగదారులు సేవలు వినియోగించుకోవడానికి ఇష్టపడుతున్నారు. కానీ గ్రామీణ ప్రాంతాల్లో, మండల కేంద్రంలో సైతం వినియోగదారులకు తిప్పలు తప్పడం లేదు.
బ్యాంకు సర్వర్ స్లోగా ఉంది
కనుక నరేష్ (వినియోగదారుల సేవా కేంద్రం ఏరియా మేనేజర్)
బ్యాంకు సర్వర్ స్లోగా ఉండడంతో వినియోగదారుల సేవా కేంద్రాల్లో వినియోగదారులకు తిప్పలు తప్పడం లేదని వినియోగదారుల సేవా కేంద్రం ఏరియా మేనేజర్ కనుక నరేష్ నవ తెలంగాణకు వివరణ ఇచ్చారు.