Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఆలేరుటౌన్
విద్యారంగానికి రాష్ట్ర బడ్జెట్లో 30 శాతం నిధులు కేటాయించాలని ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో తలపెట్టిన ప్రగతి ముట్టడికి వెళ్లకుండా శనివారం ఎస్ఐ ఎండి ఇద్రిస్ అలీ ,ఏఎస్ఐ కట్టమోహన్ రెడ్డి డీవైఎఫ్ఐ,ఎస్ఎఫ్ఐ నాయకులను ముందస్తుగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. అరెస్టు అయిన వారిలో డీివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ నాయకులు ఎలుగల శివ ,చేన్న రాజేష్ , కాసుల నరేష్ ఉన్నారు.
సీపీిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ డివిజన్ కార్యదర్శి అరెస్ట్
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో విద్యా రంగానికి 30 శాతం నిధులు కేటాయించాలని పీడీఎస్యూ, పీవైఎల్ పిలుపు మేరకే ప్రగతి భవన్ ముట్టడి వెళ్లకుండా సీపీఐఎంఎల్ న్యూడెమో డివిజన్ కార్యదర్శి బేజాడి కుమార్ను అరెస్టు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్బంధించిన ప్రజాస్వామిక వాదులను వెంటనే విడుదల చేయాలని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఆర్.జనార్దన్ కోరారు.