Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్ పమేలా సత్పతి
నవతెలంగాణ - భువనగిరి
సామాజిక అభివద్ధి కార్యక్రమాల్లో విద్యార్థులు పాలుపంచుకునేలా చూడాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. శనివారం రామన్నపేట జూనియర్ కళాశాల విద్యార్ధినులు కమర్షియల్ గార్మెంట్ టెక్నాలజీ వత్తి విద్యాకోర్సు ద్వారా తయారు చేసిన 30 డ్రెస్సులను భువనగిరి పట్టణం తారకరామనగర్లోని రెండు అంగన్వాడీ సెంటర్ల చిన్నారులకు కలెక్టర్ అందజేసి మాట్లాడారు. రామన్నపేట జూనియర్ కాలేజీ విద్యార్ధినులను అభినందించారు. కష్టపడి చదవాలని, ఇష్టమైన సబ్జెక్టులలో, వత్తి విద్యాకోర్సులలో అభివద్ధి సాధించాలని అన్నారు. సామాజిక కార్యక్రమాలలో ప్రభుత్వ శాఖలు సమన్వయం చేసుకొని పరస్పర సహకారం అందించుకోవాలని, విద్యార్ధులను సామాజిక కార్యక్రమాలలో పాలుపంచుకునేలా చేయాలని, వారి వ్యక్తిత్వ వికాసానికి దోహదపడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇంటర్మీడియట్ అధికారి రమణి, జిల్లా మహిళా శిశు సంక్షేమశాఖ అధికారి కష్ణవేణి, ప్రిన్సిపాల్స్ చంద్రకళ, పాపిరెడ్డి, సిడిపిఓ స్వరాజ్యం సూపర్వైజరు పద్మ, అంగన్వాడీ టీచర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
ఇసుక అక్రమ రవాణా జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలి
ఇసుక అక్రమ రవాణా జరగకుండా పఠిష్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. సోమవారం కాన్ఫరెన్స్ హాలులో తన అధ్యక్షతన జరిగిన డిస్ట్రిక్ లెవెల్ సాండ్ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఇసుక అక్రమ రవాణా జరగకుండా పటిÄష్టమైన చర్యలు తీసుకోవాలని, ఉదయం 6.00 నుండి సాయంత్రం 6:00 గంటల వరకు మాత్రమే రవాణా జరిగేలా క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇసుక అనుమతులు, రవాణా తీరు పట్ల ప్రతి 15 రోజులకు ఒకసారి విజిలెన్స్ పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ డి శ్రీనివాసరెడ్డి, జిల్లా ఖనిజ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ వెంకటరమణ, జిల్లా రవాణా అధికారి సురేందర్ రెడ్డి, జిల్లా గ్రౌండ్ వాటర్ డిప్యూటీ డైరెక్టర్ జ్యోతి కుమార్, జిల్లా పంచాయతీ అధికారి సునంద, జిల్లా నీటిపారుదల అధికారి నరసింహులు, ఆర్డబ్ల్యుఎస్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ లక్ష్మణ్, టీఎస్ఎండిసి ప్రాజెక్టు డైరెక్టర్ రాంప్రసాద్ పాల్గొన్నారు.