Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్డీఓ కార్యాలయం ముందు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా
నవతెలంగాణ-చౌటుప్పల్
రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న నాలుగువేల కోట్ల రూపాయల స్కాలర్షిప్పులు, ఫీజు రీయీంబర్స్ మెంట్ తక్షణమే విడుదలచేయాలని, రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి 30శాతం నిధులు కేటాయించాలని డిమాండ్‌చేస్తూ శనివారం చౌటుప్పల్ పట్టణకేంద్రంలోని జాతీయ రహదారిపై ఎస్ఎఫ్ఐ మండలకమిటీ ఆధ్వర్యంలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పల్లె శివకుమార్, మండల అధ్యక్షులు రాజుపెరియర్ మాట్లాడారు. రెండు సంవత్సరాలుగా స్కాలర్షిప్పులు, ఫీజు రీయీంబర్స్ మెంట్ విడుదలచేయకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఇంటర్ పూర్తిచేసిన విద్యార్థులు సర్టిఫికెట్ల కోసం కళాశాలల చుట్టూ తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. స్కాలర్షిప్పులు, ఫీజు రీయీంబర్స్ మెంట్ విడుదలచేయకపోతే ప్రగతి భవన్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం మండల ఉపాధ్యక్షులు తీగుళ్ల శ్రీనివాస్, పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు దాసరి ప్రకాశ్, సాతిరి మనోజ్, సహాయకార్యదర్శి విఘ్నేశ్, నాయకులు శ్రావణ్, సాగర్, వెంకట్, సుర్జీత్, సాయికిరణ్, పథ్వీరాజ్, సందీప్, ప్రవళిక, గీత, అఖిల, పూజ పాల్గొన్నారు.
వలిగొండ : విద్య రంగం పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వీడి పెండింగ్‌లో ఉన్న స్కాలర్షిప్లు, ఫీజురీయింబర్‌సమెంట్ విడుదల చేయాలని, రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి 30 నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ మండల కమిటీ ఆధ్వర్యంలో శనివారం తాసిల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ గణేష్ నాయక్ కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి వేముల నాగరాజు సంఘం నాయకులు పి అజరు మధు సుమంత్ గణేష్ ఉదరు అనిత రెడ్డి అరుణ్ శంకర్ తదితరులు పాల్గొనాన్రు.