Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -వలిగొండ రూరల్
భీమ లింగం కాలువ పూడిక తీత పనులు 15 కిలోమీటర్లు పూర్తయిన సందర్భంగా సింగిల్‌విండో చైర్మెన్ సురకంటి వెంకట్‌రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు తుమ్మల వెంకట్‌రెడ్డి, పట్టణ అధ్యక్షులు ఎమ్మె లింగస్వామి శనివారం పరిశీలించారు. 20 రోజుల క్రితం ఈ కాలువ దిగువ ప్రాంత రైతులు సాగునీరు రాకపోవడంతో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డిని కలిసి కాల్వలో పేరుకుపోయిన గుర్రపు డెక్క ఆకును తొలగించాలని కోరారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే రెండు హిటాచిలను తన సొంత డబ్బులతో సమకూర్చి పనులు చేయించారు. ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డికి కతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి ఆఇటి పాముల రవీందర్, సర్పంచ్ లు సోలిపురం సాగర్ రెడ్డి బొడ్డుపల్లి ఉమా కష్ణ, గుడిసే రాజేశ్వరి నరసింహ, ఎంపీటీసీ మోటే నరసింహ, నియోజకవర్గ యూత్ అధ్యక్షులు గూడూరు శేఖర్ రెడ్డి, మాజీ ఎంపీపీ శ్రీరాములు నాగరాజు, ఎమ్మె లక్ష్మయ్య బీసీ సెల్ అధ్యక్షులు ఐటిపాముల ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.