Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -తుర్కపల్లి
గ్రామం నుండి పట్టణం దాకా అన్నిచోట్ల బాలికలపై జరుగుతున్న వేధింపులు, దాడులను అరికట్టే బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉందని ఎంపీపీ భూక్య సుశీల రవీందర్ నాయక్ అన్నారు. శనివారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో రెండవ విడత స్నేహిత కార్యక్రమం పై అవగాహనా సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ లింగ వివక్ష లేకుండా పిల్లలను తల్లిదండ్రులు పెంచాలని, బాల కార్మికులు లేకుండా చూడాలని, బాల్య వివాహాలను అరికట్టాలని, బాలల అక్రమ రవాణా, శారీరక, మానసిక వేధింపులు, బాలలతో భిక్షాటన, బాలికల పట్ల వివక్ష, బాలికల పట్ల లైంగిక వేధింపులు లేకుండా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ, మండల స్పెషల్ ఆఫీసర్ జినుకల శ్యాంసుందర్ ,ఎంపీడీవో మానే ఉమాదేవి ,ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ సుధీర్ రెడ్డి, ఎంపీ ఓ వెంకటేశ్వర్లు ,ఎంపీటీసీలు పలుగుల నవీన్ కుమార్, మోహన్ బాబు, సిహెచ్ఓ రాజయ్య, అంగన్వాడి సూపర్వైజర్ విజయ రాణి,పంచాయతీ కార్యదర్శులు, అంగన్వాడి టీచర్లు తదితరులు పాల్గొన్నారు.