Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అక్రమ కేసులు ఉపసంహరించుకోవాలి
డీఎస్పీకి జర్నలిస్టుల వినతి
నవతెలంగాణ-మిర్యాలగూడ
యాదాద్రి భువనగిరి జిల్లాలోని మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలో నవతెలంగాణ విలేకరిగా పనిచేస్తున్న అనిశెట్టి యాదగిరిపై మున్సిపల్ చైర్మెన్ భర్త అనుచరులు దాడి చేసి గాయపరిచారని, వారిని వెంటనే అరెస్ట్ చేయాలని, విలేకరిపై పెట్టిన కేసును ఉపసంహరించుకోవాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ ఆధ్వర్యంలో శనివారం డీఎస్పీ వెంకటగిరికి వినతిపత్రం అందజేశారు. జర్నలిస్టుల ఆందోళనకు కాంగ్రెస్ పార్టీ నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా అధ్యక్షులు ఆయూబ్ మాట్లాడుతూ మోత్కూరు మున్సిపాలిటీ చైర్మెన్‌పై వార్తలు రాసినందుకు చైర్పర్సన్ భర్త అనుచరులు ఫిబ్రవరి ఒకటో తేదీన విలేఖరి యాదగిరి ఇంటిపై దాడి చేసి గాయపరచారన్నారు. అడ్డువచ్చిన భార్య, తల్లిపై కూడా దాడి చేశారని చెప్పారు. విలేఖరి యాదగిరి తన భార్యతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ కేసు నమోదు చేయకుండా ఎస్సై రాజీ కోసం విలేఖరి యాదగిరిని ఇబ్బందులు పెట్టారని తెలిపారు. రెండు రోజుల వరకు వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా, యాదగిరి భార్య ఇచ్చిన పిటిషన్ కాకుండా యాదిగిరి చేత మరో పిటిషన్ రాయించుకొని కేసు నమోదు చేశారని, అంతకుముందే చైర్పర్సన్ భర్త అనుచరులు విలేకరి యాదగిరిపై ఫిర్యాదు చేసినట్టు సష్టించి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారని ఆరోపించారు. ఎస్సై ఏకపక్షంగా వ్యవహరిస్తూ విలేకరి యాదగిరిని ఇబ్బందులు గురి చేస్తున్నాడని తక్షణమే అతనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. యాదగిరి పై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు శంకర్‌నాయక్ మాట్లాడుతూ పత్రిక స్వేచ్ఛను భంగం కలిగించే విధంగా పాలకులు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. వాస్తవాలను వెలుగులోకి తెచ్చే జర్నలిస్టులపై దాడులకు పాల్పడడం హేయమైన చర్య అన్నారు. యాదిగిరిపై దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని అతనిపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టు ఖాజా హామీదుద్దీన్, నామిరెడ్డి నరేందర్‌రెడ్డి, ఖాజా నజిమోద్దీన్, మంద సైదులు, జయరాజు, మహేష్, నాగరాజు, మహమ్మద్ నాసర్ అహ్మద్, రఫీఉద్దీన్, పగిడి రామకష, నాగేందర్, బాబు కతోజు నాగచారి, రాచకొండ రమేష్, జాని, ఉమర్, శ్రీనునాయక్, శ్రీను, ఉమ మహేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.