Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు బండ శ్రీశైలం
నవతెలంగాణ-మునుగోడు
పత్తి మద్దతు ధర క్వింటాకు రూ.12 వేలు కలిపించి రైతులను ఆదుకోవాలని రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు బండ శ్రీశైలం డిమాండ్ చేశారు. శనివారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద రైతులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కౌలు రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కౌలు రైతులను గుర్తించి, ప్రభుత్వం ప్రతి పథకమును కౌలు రైతులకు వర్తింపజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ మండల కన్వీనర్ వరికుప్పల ముత్యాలు, రైతు సంఘం నాయకులు సాగర్ల మల్లేష్, వడ్లమూడి హనుమయ్య, సీహెచ్ వీరమల్లు, నారబోయిన నరసింహ, బొందు అంజయ్య, మాజీ సర్పంచ్ సింగపంగా గౌరయ్య, బోడిసే సత్తయ్య, బొందు ముత్యాలు, సీహెచ్ రజిత, ఇరగదిండ్ల ఇద్దయ్యా, పగిళ్ల సైదులు, జీడిమెట్ల సైదులు పాల్గొన్నారు.