Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పెద్దవూర
అర్హులైన పేదలందరికి ఇండ్లు, స్థలాలు ఇవ్వాలని తెలంగాణ రైతుసంఘం జిల్లా కార్యదర్శి కూన్‌రెడ్డి నాగిరెడ్డి అన్నారు. శనివారం మండల తహసీిల్దార్ కార్యాలయం ముందు తెలంగాణ ప్రజా సంఘాల పోరాట వేదిక ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించిన అనంతరం తహసిల్దార్ సైదులుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..గత ఎనిమిది సంవత్సరాలుగా తెలంగాణ ప్రభుత్వం ఒక్కరికి కూడా ఇల్లు గాని, ఇండ్ల స్థలంగాని ఇవ్వకుండా మాటలతో కాలయాపన చేస్తుందని ఆరోపించారు. పేదలకు ప్రభుత్వం భూమి కొనుగోలు చేసి 120 గజాల చొప్పున పంపిణీ చేసి ఇండ్ల నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు, అర్హులైన పేదలందరికీ ఇండ్లు, ఇండ్ల స్థలాలు, ఇంటి నిర్మాణనికి ఐదు లక్షల ఆర్థిక సహకారం చేయాలని కోరారు. పేదవాళ్ళు సాగు చేసుకుని జీవిస్తున్న ప్రభుత్వ భూములకు పట్టాలను ఇవ్వాలన్నారు. ఫిబ్రవరి 9న ఇందిరాపార్క్ దగ్గర జరిగే మహా ధర్నాకు ఇల్లులేని పేదలంతా పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో దోరెపల్లి మల్లయ్య, చెన్ను లచ్చిరెడ్డి, తుడుమ్మ్ వెంకటయ్య, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.
హలియా : అర్హులైన పేదలకు ఇండ్లు ఇళ్ల స్థలాలు వెంటనే మంజూరు చేయాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కూన్‌రెడ్డి నాగిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం హాలియా మున్సిపల్ కార్యాలయంలో సంబంధిత అధికారికి వినతి పత్రం అందజేసి మాట్లాడారు. హాలియా పరిధిలో గత 20 సంవత్సరాల క్రితం పేదల నివాసాల కోసం ప్రభుత్వం ఇళ్ల స్థలాలకు భూమిని కొనుగోలు చేసి ప్రతి ఎన్నికల ముందు పంపిణీ చేస్తామని ఆరటం మాత్రమే చేశారు. కానీ ఆచరణ మరిచారని ఆవేదన వ్యక్తపరిచారు. హాలియా మున్సిపాలిటీ పరిధిలో పేదలు సొంత ఇల్లు లేక పెరిగిన అద్దెలతో సంపాదనలో సగం అద్దెలు కట్టడానికే సరిపోతుందని పస్తులతో జీవనం కొనసాగిస్తున్నారన్నారు. హాలియాలో 48 సర్వే నెంబర్లో నివాసముంటున్న వందలాది మంది పేదలకు తక్షణమే ఇంటి పట్టాలు ఇచ్చి రోడ్లు డ్రయినేజీ, కరెంటు, మంచినీరు సౌకర్యం కల్పించాలన్నారు. మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో ప్రభుత్వ భూమిని సేకరించి అర్హులైన పేదలకు పంపిణీ చేసి, డబల్ బెడ్ రూమ్ వర్తింప చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు అవుతా సైదులు, రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కత్తి శ్రీనివాసరెడ్డి నాయకులు పొదుల వెంకన్న, కారంపూడి ధనమ్మ, అన్నిపాక శ్రీనివాస్, అనుముల అంజి, ఎస్ కే.జానీ, ఆంజనేయులు, సైదమ్మ, కాశమ్మ, దాసు, ఈదయ్య, శ్రీను, లక్ష్మమ్మ, వెంకటేశ్వర్లు లింగయ్య, శంకర్ తదితరులు పాల్గొన్నారు.
నకిరేకల్ :తెలంగాణ ప్రభుత్వం గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో శనివారం శాలిగౌరారం తహసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు సంఘం రాష్ట్ర మహిళా కన్వీనర్ కందాల ప్రమీల మాట్లాడుతూ అర్హులైన పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రూ. లక్ష వరకు రుణమాఫీ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా నాయకులు చలకాని మల్లయ్య, వివిధ ప్రజాసంఘాల నాయకులు మక్కా బుచ్చి రాములు, కల్లూరి లింగయ్య, సిరిపంగి రాములు, గద్దపాటి అరవింద్, బట్ట లింగ ప్రసాద్, చలకాని పరమేష్, ఎం సందీప్, శ్రీశైలం, కల్లూరి అంజయ్య పాల్గొన్నారు.
నల్లగొండరూరల్ : తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇంటి స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చినప్పటికీ అమలు కాలేదని, అర్హత ఉన్న ప్రతి పేదవాడికి ఇంటి స్థలం నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి డిమాండ్ చేశారు. శనివారం కనగల్ తహసీల్దార్ కార్యాలయం ముందుధర్నా నిర్వహించి తహసీల్దార్ శ్రీనివాస్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఫిబ్రవరి 9వ తేదీన చలో ఇందిరాపార్క్ ధర్నాను జయప్రదం చేయవలసిందిగా మండల ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి కందుల సైదులు, రైతు సంఘం నాయకులు బ్రహ్మానంద రెడ్డి, మహిళా సంఘం కార్యదర్శి ఎండీ. సుల్తానా, డీివైఎఫ్‌ఐ జిల్లా నాయకులు ఎండీ. అక్రమ్, కేవీపీఎస్ మండల కార్యదర్శి అంజి తదితరులు పాల్గొన్నారు.
నిడమనూరు : అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, స్థలాలు, రేషన్ కార్డులు, పెన్షన్లు ఇవ్వాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు చినపాక లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. శనివారం మండల కేంద్రంలో సీపీఐ(ఎం) మండల కమిటి ఆధ్వర్యంలో మండల డిప్యూటీ తహసీల్దార్ రషీద్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు కొండేటి శ్రీను, మండల కార్యదర్శి కందుకూరి కోటేష్, నల్లబోతు సోమయ్య, కోదండ చరణ్ రాజు, పొట్టేపాక అంజయ్య, ఇంజమూరి శివ, కోతి ఇంద్రారెడ్డి, కొండేటి సామంతు, మెరుగు రాములు తదితరులు ఉన్నారు.
తిరుమలగిరి సాగర్ : పేదలకు ఇండ్ల స్థలాలు డబల్ బెడ్ రూమ్ ఇండ్లు వెంటనే ఇవ్వాలని తెలంగాణ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి కుర్ర శంకర్‌నాయక్, కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు వేములకొండ పుల్లయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం స్థానిక ఎమ్మార్వో ఆఫీస్‌లో ప్రజా సంఘాల నాయకులతో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు జటావత్ రవి నాయక్, తెలంగాణ గిరిజన సంఘం జిల్లా కమిటీ సభ్యులు రమావత్ నరేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
మాడుగులపల్లి : మండలంలోని తహసీల్దార్ కార్యాలయంలో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో శనివారం అర్హులైన మండల ప్రజలందరికీ ఇండ్ల స్థలాలు, డబల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేయాలని ధర్నా నిర్వహించి డిప్యూటీ తహసీిల్దార్ శివశంకర్‌కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) మండల కార్యదర్శి రొండి శ్రీనివాస్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ మండల నాయకులు పుల్లెంల శ్రీకర్, దేవిరెడ్డి అశోక్ రెడ్డి, తంగెళ్ళ నాగమణి,బొమ్మ కంటి అంజయ్య, బోరబండ శ్రీను, మల్లారెడ్డి, నాగయ్య, లక్ష్మయ్య, కవిత, జానమ్మ, సైదమ్మ తదితరులు పాల్గొన్నారు.