Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మిర్యాలగూడరూరల్
పట్టణంలోని శిష్యా పాఠశాలలో శనివారం విద్యార్థులు స్వపరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులుగా, అధికారులుగా, ప్రజాప్రతినిధులుగా వ్యవహరించి పలువురిని ఆకట్టుకున్నారు. అనంతరం ఉత్తమ ప్రతిభ కనబరిచి గెలుపొందిన విద్యార్థులకు పాఠశాల ప్రిన్సిపాల్ అలుగుబెల్లి శ్రీనివాసరెడ్డి బహుమతులు అందజేసి మాట్లాడారు. విద్యార్థులు ఉపాధ్యాయ వత్తిలో, వివిధ రంగాల్లోనీ బాధ్యతలను ప్రత్యక్షంగా నిర్వహించడం వల్ల వారిలో గల సజనాత్మకతను, నైపుణ్యాలను వెలికి తీయవచ్చన్నారు. నేటి బాలలే రేపటి పౌరులుగా ఎలా ఎదగాలో పాఠశాలలో నిర్వహించే ఇలాంటి కార్యక్రమాలే దోహద పడుతాయన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ అడుగుబెల్లి శిరీష, ఉపాధ్యాయులు అంజయ్య చారి, రమేష్, నాగరాజు, పద్మావతి, వసంతలక్ష్మి, స్వాతి ప్రియా, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.