Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి
నవతెలంగాణ-నల్లగొండ
ఇంటి స్థలాలు, ఇంటి నిర్మాణంకి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈనెల 9న నిర్వహిస్తున్న చలో హైదరాబాద్‌ను జయప్రదం చేయాలని ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి అన్నారు. ఆదివారం ఐద్వా జిల్లా కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షురాలు పోలేబోయిన వరలక్ష్మి అధ్యక్షతన పట్టణంలోని దొడ్డి కొమరయ్య భవనంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభావతి మాట్లాడుతూ రాష్ట్రంలో నిరుపేదలు ఇంటి స్థలాలు లేక స్థలమున్న ఇండ్లు నిర్మాణం చేసుకోలేక సతమత మవుతున్నారని, ఇరుకైన ఇండ్లలో కాలం వెల్లదీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటి స్థలాల సమస్యలపై ఐక్య ప్రజాసంఘాల ఆధ్వర్యంలో చలో హైదరాబాద్ నిర్వహిస్తున్నామాని, వేలాదిగా ప్రజలు తరలివచ్చి జయప్రదం చేయాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల మేనిఫెస్టోలలో ఇల్లు లేని పేదలకు ఇండ్లు ఇస్తామని వాగ్దానాలు చేశారని, బడ్జెట్లో కేటాయింపులు చేయలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రజల సొమ్మును లూటీ చేస్తుందని, పెట్టుబడుదారులకు అప్పనంగా కట్టిపెడుతుందని, పేదల సంక్షేమానికి రూపాయి ఖర్చు చేయడం లేదని విమర్శించారు. ప్రభుత్వ ఆధీనంలో వేలాది ఎకరాల భూములు ఉన్నాయని, అయినప్పటికీ చిత్తశుద్ధితో వాటిని పేదలకు అందివ్వలేదన్నారు. జిల్లా వ్యాప్తంగా ఐద్వా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మహిళలు సమీకరించినున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షురాలు పోలేబోయిన వరలక్ష్మి, రాష్ట్ర కమిటీ సభ్యురాలు జిట్టా సరోజ, జిల్లా ఆఫీసు బేరర్స్ తుమ్మల పద్మ, భూతం అరుణ, కారంపూడి ధనలక్ష్మి, జిల్లా కమిటీ సభ్యురాలు ఎండీ.సుల్తానా, గోలి వెంకటమ్మ, సైదమ్మ, నాగమణి, శాంతమ్మ, తదితరులు పాల్గొన్నారు.