Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఆలేరురూరల్
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అవకాశం ఇస్తే ఇంకా అభివృద్ధి చేసి చూపిస్తానని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీర్ల ఐలయ్య అన్నారు.ఆదివారం మండలంలోని పటేల్‌గూడెం గ్రామంలో బీర్ల ఫౌండేషన్ సౌజన్యంతో వాటర్ ప్లాంట్ ప్రారంభించారు.ముందుగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేకపూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆలేరు నియోజకవర్గంలో సుమారు 150 గ్రామాలకు వాటర్ప్లాంట్లు ఏర్పాటు చేశామని తెలిపారు.కరోనా సమయంలో ప్రతి ఇంటికి బియ్యం, కూరగాయలు,నిత్యావసర సరుకులు అందుబాటులో ఉంచామన్నారు.నియోజకవర్గంలో నాలుగు అంబులెన్స్ ఏర్పాటు చేసి సేవలు అందిస్తున్నామని తెలిపారు.ప్రతి గ్రామంలో వాటర్ప్లాంట్తో పాటు వాటర్ క్యాన్లు అందజేస్తామని,నేను రాజకీయ నాయకుడిగా కాకుండా మీకు సేవకుడిగా పని చేస్తామని పేర్కొన్నారు. అనంతరం గ్రామస్తులు ఐలయ్యను గజమాలతో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ పులగం పద్మ యాదిరెడ్డి, ఎంపీటీసీ ఆరే ప్రశాంత్‌గౌడ్, ఉపసర్పంచ్ బండ్రు లక్ష్మి ఆంజనేయులు,మండల అధ్యక్షుడు వెంకటేశ్వర రాజు, ఎన్ఎస్యూఐ మండల ప్రెసిడెంట్ సుంకరి విక్రమ్, గ్రామఅధ్యక్షుడు జహంగీర్, పార్టీ నాయకులు కందడి శేఖర్‌రెడ్డి, ప్రకాశ్‌రెడ్డి, కాల్వ నర్సిరెడ్డి, గ్యార రమేశ్, సురేష్, శ్రీకాంత్, శివశంకర్ పాల్గొన్నారు.