Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మోత్కూర్
రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రను హాత్ సే హాత్ జోడో యాత్ర ద్వారా కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని యూత్ కాంగ్రెస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు బైర్ శైలేందర్‌గౌడ్ కోరారు.తుంగతుర్తి నియోజకవర్గంలో చేపట్టే హాత్ సే హాత్ జోడో యాత్రపై ఆదివారం మోత్కూర్‌లో యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యూఐ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి ఆదేశాల మేరకు సోమవారం నియోజకవర్గంలోని తుంగతుర్తి టౌన్ నుంచి యాత్ర మొదలవుతుందన్నారు.యాత్ర ద్వారా గడపగడపను తట్టి ప్రజల మనస్సు గెలవాలన్నారు.రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపునకు యాత్ర తొలిమెట్టు అవుతుందన్నారు.ప్రతి గ్రామం నుంచి కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలిరావాలని కోరారు.ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షడు కారుపోతుల వెంకన్నగౌడ్, యూత్ కాంగ్రెస్ జిల్లా నాయకులు మందులసురేష్, ఎన్ఎస్యూఐ రాష్ట్ర కార్యదర్శి బండారు ప్రశాంత్‌రెడ్డి, మండల అధ్యక్షుడు నిమ్మల శ్రీనుయాదవ్, యూత్ కాంగ్రెస్ మండల నాయకులు అవిశెట్టి కిరణ్ యాదవ్, గుండు రాజేష్ తదితరులు పాల్గొన్నారు.