Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బీబీనగర్
క్రీడలు క్రమశిక్షణకు, దేహదారుడ్యానికి ఎంతో తోడ్పడుతాయని బిజెపి జిల్లా అధ్యక్షులు పివీ శ్యాంసుందర్రావు అన్నారు, ఆదివారం నాడు మండలంలోని జంపల్లి గ్రామ పరిధిలో మిషన్ తండాలో యూత్ మిత్ర సేవాదళ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన క్రికెట్ టోర్నమెంట్ను ఆయన ప్రారంభించినారు, సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లోని యువత కలిసికట్టుగా క్రీడలని నిర్వహించుకోవడం సంతోషకరమని అన్నారు, యువత క్రీడల్లో రాణించి గ్రామానికి మంచి పేరు ప్రతిష్టలు తేవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువ మోర్చా కోశాధికారి అంబటి తరుణ్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు పిట్టల అశోక్ మండల, అధ్యక్షులు జంగారెడ్డి,యవమోర్చా జిల్లా ఉపాధ్యక్షులు పోట్ట నవీన్ నాయకులు దేవరుప్పల శ్రీధర్, గణేష్, వెంపటి సుదర్శన్, సత్యనారాయణ, పాదం వినయ్, పెంచికల సాయి, ఆకుల సాయికుమార్, తదితరులు పాల్గొన్నారు.