Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-రామన్నపేట
రామన్నపేట పట్టణపరిధిలో రోడ్డు విస్తరణ చేయడంతో పాటు డివైడర్ నిర్మాణం, సెంటర్ లైటింగ్ ఏర్పాటుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నిధులు మంజూరు చేయడం పట్ల బీఆర్ఎస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు.సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య చిత్రపటాలకు సుభాష్సెంటర్లో ఆదివారం ఆపార్టీ పట్టణ అధ్యక్షుడు పోతరాజు సాయికుమార్ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మందడి ఉదరురెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి పోషబోయిన మల్లేశం, పట్టణ కార్యదర్శి జాడ సంతోష్, పీఏసీఎస్‌చైర్మెన్ నంద్యాల భిక్షంరెడ్డి, మార్కెట్ వైస్‌చైర్మెన్ కంభంపాటి శ్రీనివాస్, నాయకులు నీల దయాకర్, అంతటి రమేష్, బదుల రమేష్, ఎండీ ఆమీర్, పొడిచేడు కిషన్, మీర్జాఇనాయత్బేగ్, బొడ్డు అల్లయ్య, గంగాపురంయాదయ్య, ఎండి అస్లాంబేగ్, ఎండి నాసర్, ఎండి జహీరా భేగం, ఆముదలక్ష్మణ్, సల్ల సత్యప్రకాష్, రాఘవ, అనంతకుమార్, భూపతినర్సింహ, జాల అమరేందర్‌రెడ్డి, కల్లూరి నరేష్, నోములశంకర్ తదితరులు పాల్గొన్నారు.