Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తిరుమలగిరి
ఉమ్మడి తిరుమలగిరి మండలం తెలంగాణ మోడల్ స్కూల్ అనంతారంలో శనివారం లయన్స్ క్లబ్, మార్గం ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా 15 పాఠశాలల మధ్య క్విజ్ పోటీలు ఘనంగా నిర్వహించారు.కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా లయన్ డాక్టర్ ఆర్య మార్కెటింగ్ కోఆర్డినేటర్ మార్గం ప్రభాకర్, ప్రవీణ్‌లు హాజరయ్యారు.హోరాహోరీగా జరిగిన క్విజ్ పోటీల్లో గెలుపొందిన పాఠశాలలు మొదటి, ద్వితీయ, తృతీయ, చతుర్ధ బహుమతులు గెలుపొందాయి.మొదటి బహుమతిగా కృష్ణవేణి టాలెంట్ స్కూల్, ద్వితీయ బహుమతిగా జెడ్పీహెచ్ఎస్ వెలిశాల, తృతీయ బహుమతిగా జెడ్పీహెచ్ఎస్ ఈటూరు, చతుర్ధ బహుమతిగా ఫాతిమా హైస్కూల్ పాఠశాలలు గెలుచుకున్నాయి.వీరికి దాత నాగేంద్రాచారి సహాయంతో షీల్డ్, సర్టిఫికెట్తో పాటు పారితోషికం అందించారు.అదేవిధంగా లయన్స్ క్లబ్ అధ్యక్షుడు జలగం రామచంద్రయ్య పుట్టినరోజు సందర్భంగా గెలుపొందిన విద్యార్థులకు క్లబ్ ఆధ్వర్యంలో సర్టిఫికెట్తో పాటు షీల్డ్, గోడ గడియారాలు అందజేశారు.పోటీలలో పాల్గొన్న విద్యార్థులందరికీ ఉపాధ్యాయుడు ఎల్లయ్య తయారుచేసిన 150 పేజీల టెక్స్ట్ పేపర్స్ విద్యార్థులకు అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షుడు జలగం రామచంద్రయ్య మాట్లాడుతూ విద్యయే మనిషి జీవితానికి వెలుగునిస్తుందన్నారు.మనిషి వికాసానికి నడవడిక తోడ్పడుతుందన్నారు.ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు డాక్టర్ చంద్రశేఖర్, మార్గం ప్రభాకర్, దండి ప్రవీణ్‌కుమార్, క్లబ్ అధ్యక్షుడు జలగం రామచంద్రయ్య, కార్యదర్శి ఐత శ్రీనివాస్, కోశాధికారి సురేష్‌కుమార్, ఇమ్మడి వెంకటేశ్వర్లు, కృష్ణమాచారి,కె.లక్ష్మయ్య, సుందర్, గణేష్, సోమేశ్, లక్ష్మణ్,యాకయ్య,మోడల్‌స్కూల్ ప్రిన్సిపాల్ బాలరాజు, వెలిశాల పాఠశాల ప్రధానో పాధ్యాయులు, మోడల్‌స్కూల్ ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.