Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సూర్యాపేట
వ్యక్తిగత ఆరోగ్యంపై ప్రతి ఒక్కరూ శ్రద్ధ వహించాలని పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షులు అప్పం శ్రీనివాసరావు, బీఆర్ఎస్ జిల్లా నాయకులు గండూరి కృపాకర్ అన్నారు.ఆదివారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో లయన్స్ క్లబ్ ఆఫ్ సూర్యాపేట , పద్మశాలి యువజన విభాగం ఆధ్వర్యంలో అపోలో డయాగస్టిక్ సెంటర్ వారి సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఉచిత రక్త పరీక్షల శిబిరానికి వారు ముఖ్యఅతిథులుగా హాజరై మాట్లాడారు.ఆరోగ్య పరిరక్షణకు రెగ్యులర్‌గా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలన్నారు.ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.వ్యాయామాన్ని నిత్య జీవితంలో భాగం చేసుకోవాలన్నారు.పద్మశాలి యువజన సంఘం, లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత రక్త పరీక్షల శిబిరం నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు.అనంతరం షుగర్, కొలెస్ట్రాల్ పరీక్షలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మెన్ పెండెం చంద్రశేఖర్, పద్మశాలి సంఘం రాష్ట్ర కార్యదర్శి చలమల్ల నర్సింహ, లయన్స్ క్లబ్ అధ్యక్షులు డాక్టర్ రమేష్‌చంద్ర, పద్మశాలి యువజన విభాగం అధ్యక్షులు మిట్టకొల యుగంధర్, సంఘం ప్రచార కార్యదర్శి, కార్యక్రమ నిర్వాహకులు పున్నం వెంకన్న, కొంగరి ఉపేందర్, జగదీష్, అపోలో డయా గస్టిక్ సెంటర్ సూర్యాపేట ఇన్చార్జి గంజి రాము, గంజి సంతోష్ , మహేష్ ,రాచకొండ శ్రీనివాస్,సాలయ్య,భిక్షం, వెంకట్,సందీప్,కల్యాణ్ తదితరులు పాల్గొన్నారు.