Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్ పమేలా సత్పతి
నవ తెలంగాణ -భువనగిరి రూరల్
మహిళల ఆర్ధిక పురోగతి, సాధికారతకు సహకారం అందించాలని, జిల్లా యంత్రాంగం అన్ని విధాల సహాయపడుతుందని కలెక్టర్ పమేలా సత్పతి వురు హబ్ ప్రతినిధి బృందాన్ని కోరారు.గురువారం కాన్ఫరెన్స్ హాలులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ఉమెన్ ఎంట్రపెన్యూర్స్ హబ్ వురు హబ్ , సీఈఓ దీప్తి ఆధ్వర్యంలో నలుగురు సభ్యులు గల బృందం కలెక్టర్‌ను కలిసి సంస్థ ఆధ్వర్యంలో చేపట్టే కార్యక్రమాలను వివరించారు. మహిళలు నిర్వహించే స్టార్టప్ లకు అన్ని రకాలుగా అండగా నిలబడడం, భాగస్వామ్యం కావడం, మెంటార్‌గా మార్గ నిర్దేశనం చేయడం, నిధులు సమకూర్చడం వంటి పనులతో మహిళా సాధికారతపై పనిచేస్తున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వారితో మాట్లాడుతూ విద్యారంగంలో రాబోయే 3 సంవత్సరాలలో ఉపాధ్యాయులకు, విద్యార్థులకు సృజనాత్మకతపరంగా విద్యా బోధనలో మార్పులు తేవడానికి, సమస్యలను అధిగమించడం, ఒకేషనల్ కోర్సులలో స్వయం ఉపాధికి కావలసిన సదుపాయాలు, శిక్షణ అందించాలని, మహిళా స్వయం సహాయక సంఘాలకు కావలసిన సహకారం అందించి, ఆర్ధిక బలోపేతానికి, నైపుణ్యాన్ని మెరుగుపరచే విషయాలలో జిల్లా యంత్రాంగంతో కలిసి పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి మందడి ఉపేందర్ రెడ్డి, జిల్లా విద్యా శాఖ అధికారి నారాయణరెడ్డి, సెక్టోరియల్ అధికారి అండాళు పాల్గొన్నారు.